AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుతో ఒక్క సినిమాకే సెన్సేషన్.. 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న తోపు హీరోయిన్.. 63 ఏళ్లలోనూ అదరగొట్టే లుక్స్..

ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో ఆమె ఓ సెన్సేషన్. తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె నటించిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది.

చిరుతో ఒక్క సినిమాకే సెన్సేషన్.. 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న తోపు హీరోయిన్.. 63 ఏళ్లలోనూ అదరగొట్టే లుక్స్..
Actress Meenakshi Seshadri
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2026 | 6:23 PM

Share

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 80 , 90వ దశకంలో తన అద్భుతమైన అందం, అభినయం, నాట్య ప్రతిభతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘హీరో’, ‘దామిని’, ‘ఘాయల్’, ‘మేరీ జంగ్’ వంటి సంచలన చిత్రాలతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అమెరికాలో స్థిరపడ్డారు. అయితే, సుదీర్ఘకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ తాజాగా దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో, అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

1981లో ‘ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకున్న మీనాక్షి శేషాద్రి, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. దర్శకుడు సుభాష్ ఘై తెరకెక్కించిన ‘హీరో’ చిత్రం ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ చిత్రంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో వచ్చిన ‘దామిని’ చిత్రం ఆమె నటిగా అత్యున్నత శిఖరాలను తాకేలా చేసింది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆపద్భాంధవుడు చిత్రంలో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

30 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్:

కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలోనే 1995లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్ వివాహం చేసుకున్న మీనాక్షి శేషాద్రి, ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా వీడ్కోలు పలికి అమెరికాకు వెళ్ళిపోయారు. అక్కడ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, తన సొంత నృత్య పాఠశాలను ప్రారంభించి ఎంతో మంది విద్యార్థులకు భరతనాట్యం , ఇతర భారతీయ నృత్య రీతులలో శిక్షణ అందించారు. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె, కొద్దికాలం క్రితం ముంబైకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్రలు చేసేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆమె ఇటీవల వెల్లడించారు. కేవలం ప్రధాన పాత్రలే కాకుండా, కథకు ప్రాధాన్యమున్న ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధమని తెలపడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత అలనాటి స్టార్ హీరోయిన్ మళ్లీ తెరపైకి రానుండటంతో బాలీవుడ్‌లో ఈ రీఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

మీనాక్షి శేషాద్రి..

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

Follow Us
63 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్.. 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ..
63 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్.. 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ..
మన టైమ్ వచ్చేసింది భయ్యా! కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మహర్దశ..
మన టైమ్ వచ్చేసింది భయ్యా! కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మహర్దశ..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్..
ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ గుండా వెళ్తున్నారా..? అలర్ట్
ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ గుండా వెళ్తున్నారా..? అలర్ట్
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’..
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’..
ఒక చేతిలో 3 యాపిల్స్, 4 ఆరెంజ్‌లు.. మరో చేతిలో 4 యాపిల్స్, 3 ఆరెం
ఒక చేతిలో 3 యాపిల్స్, 4 ఆరెంజ్‌లు.. మరో చేతిలో 4 యాపిల్స్, 3 ఆరెం
కేవలం ₹3 ఖర్చుతో.. మొక్కలకు వచ్చే బూజు తెగులు, పురుగులు మాయం!
కేవలం ₹3 ఖర్చుతో.. మొక్కలకు వచ్చే బూజు తెగులు, పురుగులు మాయం!
మీ పెన్ గ్రిప్ చెప్పే మీ సీక్రెట్ పర్సనాలిటీ ఇదే..!
మీ పెన్ గ్రిప్ చెప్పే మీ సీక్రెట్ పర్సనాలిటీ ఇదే..!
దోస పిండి లో ఇది ఒక్కటి కలపండి.. కర కరలాడటం పక్కా
దోస పిండి లో ఇది ఒక్కటి కలపండి.. కర కరలాడటం పక్కా
చెన్నై కాదు.. ఐపీఎల్ 2008 వేలంలో ధోనీ కోసం పోరాడిన టీం ఇదే..!
చెన్నై కాదు.. ఐపీఎల్ 2008 వేలంలో ధోనీ కోసం పోరాడిన టీం ఇదే..!