The Odyssey OTT: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’.. తెలుగులో ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్.. ఎన్నో నెలలుగా ఎదురు చూస్తోన్న ‘ది ఒడిస్సీ’ సినిమా కాసేపటి క్రితమే ఓటీటీలోకి వచ్చేసింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగుతో పాటు ప్రధాన భాషలన్నింటిలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమదే ఊరళి (తెలుగులో ప్రేమనే ఊరిలో) సినిమా సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీంతో పాటు అనుపమ క్రేజీ కళ్యాణం, హైకూ, అనుమాన పక్షి, 418, అన్బిల్ అవన్, అనుమాన పక్షి తదితర సినిమాలు ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ లిస్టులో ఉన్నాయి. అయితే వీటికంటే ముందు కాసేపటి క్రితమే ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’. . ఈ ఏడాది జూలై 17 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. సామాన్యులతో పాటు సినీ తారలు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఇండియాలోనూ, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఈ సినిమాను ఎగబడి చూసేశారు. అందుకు తగ్గట్టుగానే ది ఒడిస్సీ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. సుమారు రూ.2,300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ.16 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఇండియాలో కూడా ఈ సినిమా సుమారు రూ.191 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచిన ‘ది ఒడిస్సీ’ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెర పడింది. కాసేపటి క్రితమే ఈ విజువల్ వండర్ రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది.
ప్రస్తుతం ది ఒడిస్సీ సినిమా ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ తో పాటు యాపిల్ టీవీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీగా చూసే అవకాశం లేదు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ చెల్లించి ఈ విజువల్ వండర్ చూడాల్సి ఉంటుంది. త్వరలో సబ్స్క్రైబర్స్ అందరికీ ఉచితంగా చూసే అవకాశం రానుంది.
అమెజాన్ ప్రైమ్ లో ది ఒడిస్సీ..
#TheOdyssey (English) Streaming Now on @PrimeVideoIN in English, Tamil, Telugu & Hindi
#OTT_AD_SQUAD https://t.co/V4jwZ192jQ
— OTT AD SQUAD (@OTT_AD_SQUAD) November 17, 2026
ది ఒడిస్సీ సినిమా విషయానికి వస్తే.. హోమర్ రాసిన ప్రఖ్యాత గ్రీకు ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు క్రిస్టోఫర్ నోలన్. మాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, చార్లీజ్ థెరాన్, లుపిటా న్యోంగో తదితర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు లుడ్విగ్ గోరాన్సన్ మ్యూజిక్ అందించగా… క్రిస్టోఫర్ నోలన్, ఎమ్మా థామస్ తమ సింకోపీ నిర్మాణ సంస్థపై ఈ సినిమాను నిర్మించారు.
ది ఒడిస్సీ సినిమా ట్రైలర్ తెలుగులో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




