Renu Desai: హీరో ధనుష్‌కు క్షమాపణలు చెప్పిన రేణూ దేశాయ్.. ఏం జరిగిందంటే?
సుమారు మూడేళ్ల క్రితం అంటే 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు నటి రేణుదేశాయ్. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో హేమలతా లవణం అనే పాత్రలో అనే సామాజిక సంస్కర్ల పాత్రలోనటించారు. ఈ మూవీలో రేణూ దేశాయ్ పాత్రకు మంచి పేరు వచ్చింది.

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా.. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి విభిన్న రంగాల్లో సత్తా చాటారు రేణూదేశాయ్. కెరీర్ ప్రారంభంలో బద్రి, జానీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె పెళ్లి, పిల్లల తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. అయితే ఇప్పుడు పిల్లలు పెద్ద వారు కావడంతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అలా మూడేళ్ల క్రితం సుమారు మూడేళ్ల క్రితం అంటే 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు నటి రేణుదేశాయ్. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో హేమలతా లవణం అనే పాత్రలో అనే సామాజిక సంస్కర్ల పాత్రలోనటించారు. ఈ మూవీలో రేణూ దేశాయ్ పాత్రకు మంచి పేరు వచ్చింది. దీంతో రేణూ దేశాయ్ నటిగా బిజీ అవుతుందుకున్నారు. మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుందనుకున్నారు. అయితే అదేమీ జరగలేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నారు రేణూ దేశాయ్. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఓం చాప్టర్ 1 సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి మరో కీలక పాత్ర పోషించారు. అలాగే శ్రీలీల, సాయి పల్లవి కథానాయికలుగా చేశారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం (నవంబర్ 16) హైదరాబాద్ వేదికగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో ధనుష్, మమ్ముట్టితో సహా చిత్ర బృందమంతా హాజరయ్యారు. అలాగే నటి రేణూ దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె మొదట హీరో ధనుష్ కు క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
‘ధనుష్ సర్ నాకు తమిళం సరిగా మాట్లాడటం రాదు.. షూటింగ్ సమయంలో నా తమిళ తప్పులను చాలా ఓపికగా భరించినందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా కొన్నిసార్లు ఈమె ఎందుకు తమిళం సరిగా మాట్లాడలేక పోతుందని అనిపించి ఉండవచ్చు. అందుకు నన్ను క్షమించండి’ అంటూ క్షమాపణలు చెప్పారు. ఇలా తమిళం సరిగా మాట్లాడలేక ఇబ్బంది పెట్టడంతోనే హీరో ధనుష్ కు క్షమాపణలు చెప్పారు రేణూ దేశాయ్. తమిళంలో డైలాగ్స్ చెప్పేటప్పుడు తాను చేసిన పొరపాట్లను ధనుష్ ఎంతో సహనంతో అర్థం చేసుకుని సహకరించారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఓమ్ సినిమా గురించి మాట్లాడిన రేణూ దేశాయ్.. ఈ ఏడాది శివరాత్రి రోజు నాకు ఈ సినిమా టీం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆరోజు నేను కామాఖ్య ఆలయంలో ఉన్నాను. శివరాత్రి, కామాఖ్య ఆలయం, ఓం సినిమా ఈ మూడు చాలా పవర్ఫుల్ కాంబినేషన్. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. నాకు నటించడం రాదు అలాంటిది మమ్ముట్టి గారు ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంటే చాలా భయం వేసింది. 20వ తేదీ మీరందరూ థియేటర్ కి వచ్చి నేను ఎలా నటించాననే విషయాన్ని మీరే చెప్పాలి’ అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రేణూదేశాయ్, ఆద్య
A cute moment at the #OM Event…!
#RenuDesai says NO when the Anchor invites her daughter #AadhyaKonidela onto the stage. https://t.co/mA7zO1wwDt
— Rangasthalam (@RangasthalamIN) November 16, 2026
.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




