AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో బిగ్ ట్విస్ట్.. హౌస్‌లోకి రోహిత్ పాటు ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో బిగ్ ట్విస్ట్. ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయిన రోహిత్ నాయుడు తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో బిగ్ ట్విస్ట్.. హౌస్‌లోకి రోహిత్ పాటు ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ!
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Nov 15, 2026 | 8:20 PM

Share

ఆడియెన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదో వారం వీకెండ్ కూడా వచ్చేసింది. దీపావళి పండగ సందర్భంగా గత వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ వారం కెప్టెన్ టెంపర్ వంశీ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ముఖేష్, వర్షిణి, సుధీర్, నీతూ మాస్టర్, దేబ్జానీ, రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, శ్వేతా, శివకుమార్, త్రిగుణ్, రామకృష్ణ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. మరి వీరిలో ఎవరు బయటకు వస్తారన్నది మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన రోహిత్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తాడని గత రెండు వారాలుగా ప్రచారం జరుగుతోంది. దీపావళి వీక్ లోనే అతన్ని హౌస్ లోకి తీసుకొద్దామని అంతా అనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో అది సాధ్య పడలేదు. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ ఉండడం తో రోహిత్ రీ ఎంట్రీ ప్లాన్ ని వాయిదా వేశారు. అయితే పదకొండో వారం మాత్రం రోహిత్ తో పాటు మరో ఇద్దరు పాత కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొని రాబోతున్నారని టాక్. రోహిత్ తో పాటు హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తోన్న ఆ కంటెస్టెంట్స్ మరెవరో కాదు షాలిని, అపూర్వ, ఈ ముగ్గురు వారం రోజుల పాటు హౌస్ లో గెస్ట్ కంటెస్టెంట్స్ గా ఉండనున్నారట. ఆ తర్వాత ఆడియన్స్ ఓటింగ్ తో కేవలం ఒకరిని మాత్రమే హౌస్ లో శాశ్వతంగా ఉంచుతారట.

కాగా పదకొండో వారం నామినేషన్స్ విషయంలో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈసారి ఎలిమినేట్ అయ్యి ఇంట్లోంచి వెళ్లిపోయిన పాత కంటెస్టెంట్లు వచ్చి హౌస్ మేట్స్ ను నామినేట్ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్ తో పాటు షాలినీ , అపూర్వలు రీఎంట్రీ ఇవ్వనున్నారట. వారు ఇంట్లోనే వారం రోజుల పాటు గెస్టులుగా ఉంటారని తెలుస్తోంది. కాగా రోహిత్, షాలినీ ఇద్దరూ కూడా ఆడియెన్స్ ఓట్లతో ఎలిమినేట్ కాలేదు. షాలినీ ఒకసారి ఎలిమినేషన్ వరకు వచ్చి.. సీక్రెట్ రూంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చిన షాలినీ.. ఇంటి సభ్యుల ఓట్లతో బయటకు వెళ్లింది. రోహిత్ కూడా రెడ్ జోన్‌లోనే ఉండటం.. మెజార్టీ సభ్యుల ఓట్లతో బయటకు వచ్చేశాడు. షాలినీ సంగతేంటో కానీ రోహిత్‌ను బయటకు పంపించడంపై ఇప్పటికీ చాలా మంది, ముఖ్యంగా అతని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ రీఎంట్రీ కచ్చితంగా ఉండనుందని తెలుస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఆదివారం (నవంబర్ 15) లేదా సోమవారం (నవంబర్ 16) నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us