AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమా టైటిల్ అద్దిరిపోయిందిగా.. స్టోరీ ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్షన్ లో 'రాకా' అనే పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా రాకా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బన్నీ.

Allu Arjun: అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమా టైటిల్ అద్దిరిపోయిందిగా.. స్టోరీ ఏంటంటే?
Allu Arjun and Lokesh Kanagaraj
Basha Shek
|

Updated on: Nov 13, 2026 | 9:12 PM

Share

పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ తో సినిమాలు చేసేందుకు స్టార్ దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. రాకా పేరుతో తెరకెక్కుతోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజి బిజీగా ఉంటున్నారు బన్నీ. కాగా రాకా తర్వాత కోలీవుడ్ కే చెందిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లోనే మరో మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన 2026 జనవరిలోనే వచ్చింది. అయితే సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సినిమా టైటిల్, జానర్‌కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్‌- లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఏఏ 23’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు లోకేష్‌ కనగరాజ్‌. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట. కాగా ఈ సినిమా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో రూపొందనుందని, ఈ చిత్రానికి ‘గ్యాంగ్‌ స్టార్‌’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం బన్నీ సరికొత్తగా మేకోవర్‌ కానున్నారని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ ‌డేట్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు కూడా కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరుంది. ఖైదీ, మాస్టర్, లియో, కూలీ సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవలే హీరోగానూ ఎంట్రీ ఇచ్చారీ స్టార్ డైరెక్టర్. డీసీ మూవీతో ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టారు.

గ్యాంగ్ స్టార్ గా అల్లు అర్జున్..

View this post on Instagram

A post shared by Filmiitalks (@filmiitalks)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో