AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Praveen: తండ్రైన జబర్దస్త్ కమెడియన్.. ఆస్పత్రి నుంచే వీడియో పోస్ట్ చేసిన పటాస్ ప్రవీణ్

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పటాస్ ప్రవీణ్ శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన భార్య ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు.

Jabardasth Praveen: తండ్రైన జబర్దస్త్ కమెడియన్.. ఆస్పత్రి నుంచే వీడియో పోస్ట్ చేసిన పటాస్ ప్రవీణ్
Jabardasth Praveen
Basha Shek
|

Updated on: Nov 11, 2026 | 9:08 PM

Share

జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇవాళ ( నవంబర్ 11) తన భార్య, ప్రముఖ డ్యాన్సర్ కడెం వంశిత పండంటి పాపకు జన్మనిచ్చిందని ఒక వీడియో రిలీజ్ చేశాడు. కాగా నేరుగా ఆస్పత్రి నుంచే ఈ వీడియో పోస్ట్ చేశాడు ప్రవీణ్. ఇందులో ప్రసవానికి ముందు ప్రవీణ్ తన భార్యకు సేవలు చేయడం, అలాగే వంశిత ఆపరేషన్ థియేటర్ కి వెళ్లడం, డాక్టర్ పాపని తీసుకురావడం, పాపని ఎత్తుకొని తండ్రిగా ప్రవీణ్ ఆనందపడటం వంటి ఎన్నో దృశ్యాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తండ్రిగా ప్రమోషన్ పొందిన ప్రవీణ్ కు బుల్లితెర సెలబ్రిటీలు, నెటిజన్లు, సినీ అభిమానులు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రవీణ్- కడెం వంశితలు పెళ్లిపీటలెక్కారు. అంతకు ముందు చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. సింపుల్ గా ఓ గుడిలో వీరి వివాహం జరిగింది. పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు ప్రవీణ్- వంశితల వివాహానికి హాజరయ్యారు. వీరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు, వీడియోలు కూడా అప్పట్లో నెట్టింట బాగా వైరలయ్యాయి.

ఇక తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా కొద్ది రోజుల క్రితమే గర్భం ధరించింది వంశిత. స్వయంగా ప్రవీణే ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఓ పండంటి పాపను తమ జీవితంలోకి ఆహ్వానించారీ జబర్దస్త్ కపుల్. ప్రవీణ్ విషయానికి వస్తే.. మొదట పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు. తనదైన పంచులు, కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగు పెట్టి మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు ప్రవీణ్. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడీ కమెడయిన్.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో ప్రవీణ్- కడెం వంశిత..

ఇక కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us