AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie: ఖురాన్ లేదా బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? ‘రామాయణ’ దర్శక నిర్మాతలపై శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం

బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోన్న రామాయాణంపై వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై 'శక్తిమాన్' ఫేమ్ నటుడు ముఖేష్ ఖన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కథ కన్నా 4,000 కోట్ల బడ్జెట్‌ను తిరిగి రాబట్టుకోవడమే ప్రధాన ఎజెండాగా మారిందంటూ ఘాటుగా విమర్శించారు.

Ramayana Movie: ఖురాన్ లేదా బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? 'రామాయణ' దర్శక నిర్మాతలపై  శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
Ramayana Movie
Basha Shek
|

Updated on: Nov 10, 2026 | 10:04 PM

Share

నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన ‘రామాయణం: పార్ట్ 1’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాపై రోజుకో వివాదం తలెత్తుతోంది. తాజాగా శక్తిమాన్ సీరియల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా రామాయణం సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్ం చేశారు. బి.ఆర్. చోప్రా ‘మహాభారతం’ సీరియల్‌లో భీష్మ పితామహుడి పాత్రలో నటించిన ముఖేష్ ఖన్నా, ఇప్పుడు ‘రామాయణం’ చిత్రంలో సీతామాతను చిత్రీకరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తన యూట్యూబ్ వ్లాగ్‌లో రామాయణ సినిమా గురించి మాట్లాడిన ముఖేష్ ఖన్నా ఇలా అన్నారు, “నేను హిందీ చిత్ర పరిశ్రమలోని నిర్మాతలను, దర్శకులను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వాల్మీకి రామాయణంలోని వాస్తవాలను వక్రీకరించి, మీ కల్పనలకు అనుగుణంగా చూపించడం సరైనదేనా? సినిమా విడుదలైనప్పటి నుంచి ఇంటర్నెట్‌లో దీనిపై చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ, నిర్మాతలకు రామాయణ కథను నిజాయితీగా చెప్పడానికి బదులుగా, పెట్టుబడిగా పెట్టిన రూ. 4,000 కోట్ల బడ్జెట్‌ను తిరిగి రాబట్టుకోవడమే ప్రధాన ఎజెండాగా ఉంది’ అని ఘాటుగా విమర్శించారు శక్తిమాన్.

సినిమాలో సాయి పల్లవి పోషించిన సీతామాత పాత్రను కత్తితో పోరాడే యోధురాలిగా చిత్రీకరించడాన్ని ముఖేష్ ఖన్నా తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ సీతమాత ఝాన్సీ రాణిలాగా ఇద్దరు ముగ్గురు రాక్షసులతో పోరాడటంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేను వాల్మీకి రామాయణాన్ని పరిశీలించాను. అందులో అలాంటి ప్రస్తావన ఎక్కడా లేదు. నాకు తెలిసినంతవరకు, సీతామాత ఎప్పుడూ యుద్ధం చేయలేదు. ఆమె గనుక యోధురాలు అయితే, రావణుడు ఆమెను అపహరించడానికి వచ్చినప్పుడు అతనితో పోరాడి ఉండేది. రావణుడు ఆమెను అంత సులభంగా ఎలా అపహరించగలిగాడు?” అని ముఖేష్ ఖన్నా ప్రశ్నించారు.

కాగా ఈ విషయంపై చిత్ర బృందం ఇచ్చిన వివరణకు స్పందించిన ముఖేష్ ఖన్నా, “ఈ సన్నివేశాన్ని వాల్మీకి రామాయణం నుంచి కాకుండా ‘అద్భుత రామాయణం’ అనే పుస్తకం నుండి తీసుకున్నామని నిర్మాతలు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలైన రామాయణం వాల్మీకి రాసినదే. దానికంటే రెండు అడుగులు ముందుకు వెళ్లే అధికారం ఎవరికీ లేదు. ఖురాన్ లేదా బైబిల్ కథను మార్చే ధైర్యం నిర్మాతలకు ఉందా? లేకపోతే, రామాయణాన్ని మార్చడానికి వారికి ఎంత ధైర్యం ఉంది?’ అని తీవ్రంగా విమర్శించారు శక్తిమాన్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రామాయణ సినిమాపై ముఖేష్ ఖన్నా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఖురాన్ లేదా బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
ఖురాన్ లేదా బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం