AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: దీపావళి రోజున ఇలాంటి పనులా? ‘వారణాసి’ హీరోయిన్‌పై విమర్శలు.. అసలు ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వివాహం తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డారు. అయినా క్రమం తప్పకుండా భారతీయ పండగలను జరుపుకొంటోందీ అందాల తార. తాజాగా దీపావళి పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు ప్రియాంక చోప్రా. అయితే ఒక విషయంలో మాత్రం నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Priyanka Chopra: దీపావళి రోజున ఇలాంటి పనులా? 'వారణాసి' హీరోయిన్‌పై విమర్శలు.. అసలు ఏం జరిగిందంటే?
Priyanka Chopra
Basha Shek
|

Updated on: Nov 11, 2026 | 6:30 AM

Share

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన లాస్ ఏంజిల్స్‌లోని ఇంట్లో కుటుంబంతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు . ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్, కుమార్తె మాల్తీ మేరీలతో కలిసి పండుగకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోను చూసిన తర్వాత, కొంతమంది నెటిజన్లు ప్రియాంకను తీవ్రంగా ట్రోల్ చేశారు. ప్రియాంక దీపావళి పండుగ అలంకరణలు, పూజలు, ఆహారానికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో ఆమె రొయ్యలు తింటూ కనిపించింది. దీపావళి వంటి పవిత్ర పండుగ రోజున మాంసాహారం తినడంపై ప్రియాంకను తప్పుపడుతున్నారు నెటిజన్లు. ప్రియాంక పోస్ట్‌పై వ్యాఖ్యానించిన వారిలో చాలామంది, ‘దీపావళి నాడు మాంసాహారం తినడం సరైనదేనా? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను’, ‘దీపావళి నాడు మాంసాహారం తినడం సరైనదేనా?’, ‘పండుగకు దీపాలు వెలిగించకుండా కొవ్వొత్తులు ఎందుకు ఉపయోగించారు?’ అని అడిగారు. మరికొందరు, ‘నా అభిమాన నటి, ఆమె దుస్తుల నుంచి ఆభరణాల వరకు, ఈసారి ఏదీ సరిగ్గా లేదు’ అని నెటిజన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ప్రియాంక చోప్రా భారతీయ సంప్రదాయాలను పాటిస్తోంది. ఇందులో భాగంగా భారతీయ పండుగలను క్రమం తప్పకుండా జరుపుకొంటున్నారు. ఇటీవల, దసరా పండుగ సందర్భంగా కూడా ప్రియాంక ఇంట్లోనే పెద్ద ఎత్తు ూజలు, హోమాలు జరిగాయి. భర్త నిక్ జోనాస్ తమ కుమార్తె మాల్తి పాదాలను కడుగుతున్న అందమైన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది ప్రియాంక. అయితే అనుకోకుండా చేసిన తప్పుకు ట్రోల్స్ బారిన పడింది.

ఇవి కూడా చదవండి

సినిమాల విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా త్వరలో భారతీయ చిత్రసీమలోకి పునరాగమనం చేయబోతోంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. టైమ్ ట్రావెల్, యాక్షన్ అడ్వెంచెరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తున్నాడు. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7 న విడుదల కానుంది.

దీపావళి వేడుకల్లో ప్రియాంక చోప్రా..<

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

/h3> మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us