వారణాసి
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచేశారు రాజమౌళి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ప్రపంచాన్ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. వారణాసి అనే టైటిల్ తో ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న వారణాసి సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా 7 ఏప్రిల్ 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు వివిధ గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. మహేష్ బాబు శ్రీ రాముడిగా కనిపిస్తాడు అని ఇప్పటికే రాజమౌళి లీక్ చేశారు.
ఇంకా చదవండివారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జక్కన్న పాన్ వరల్డ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
- Rajeev Rayala
- Updated on: Sep 14, 2026
- 11:34 am
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణ, వివరాల ధ్రువీకరణలో భాగంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR ప్రక్రియలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యాయి. మహేష్ బాబు, రాజమౌళి, నమ్రత, వెంకటేష్, సమంత, విజయ్ దేవరకొండ, ఉపాసనతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్ల నమోదులో పొరపాట్లే కారణంగా అధికారులు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
- Phani CH
- Updated on: Sep 12, 2026
- 5:40 pm
మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను యాక్షన్ అడ్వాంచరల్ కథతో తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దాంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు నయా లుక్ లోకి మారిపోయాడు. అలాగే బాడీని కూడా డవలప్ చేశారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించనున్నారని తెలుస్తోంది.
- Rajeev Rayala
- Updated on: Aug 27, 2026
- 12:34 pm
Varanasi Movie: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా.. మహేష్ బాబు ‘వారణాసి’ కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'వారణాసి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
- Basha Shek
- Updated on: Aug 23, 2026
- 9:45 pm
Varanasi: ఆ రెండు దేశాల్లో వారణాసి కోసం స్పెషల్ ప్రమోషన్స్
రాజమౌళి తన ప్రతి సినిమా ప్రమోషన్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. వారణాసి కోసం గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటూ, ముఖ్యంగా ఫ్రాన్స్, లాటిన్ అమెరికా దేశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. RRR, బాహుబలి సినిమాలకు నెట్‌ఫ్లిక్స్‌లో అక్కడ వచ్చిన అద్భుత స్పందనే దీనికి కారణం. హాలీవుడ్ మ్యాగజైన్‌లతో ప్రచారం ప్లాన్ చేశారు.
- Phani CH
- Updated on: Aug 17, 2026
- 7:08 pm
మహేష్ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి (SSMB29) చిత్రం నుండి తాజా అప్‌డేట్ విడుదలైంది. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ నుండి మహేష్ బాబు కొత్త లుక్ ఆవిష్కరణ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. రామ లుక్ ఆశించిన అభిమానులకు రుద్ర లుక్ రావడంతో కొంత నిరాశ వ్యక్తమైంది.
- Samatha J
- Updated on: Aug 12, 2026
- 1:06 pm
Varanasi: వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా SSMB29పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘వారణాసి లీక్డ్ విజువల్స్’ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే లీకులను షేర్ చేయకుండా ‘సే నో టు లీక్స్’ అంటూ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా స్పందించారు. రాజమౌళి నుంచి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ లేదా గ్లింప్స్ వస్తుందనే ప్రచారం సాగుతోంది. దీంతో మహేష్ బర్త్‌డే స్పెషల్‌గా SSMB29పై ఎలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Phani CH
- Updated on: Aug 9, 2026
- 5:32 pm
మహేష్ బాబుతో స్పోర్ట్స్ డ్రామా.. వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
- Rajeev Rayala
- Updated on: Jun 18, 2026
- 8:07 am
నార్త్ Vs సౌత్.. వారణాసిని టార్గెట్ చేస్తున్నారా..?
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై, అలాగే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారణాసి బడ్జెట్, రికవరీ అవకాశాలపై వస్తున్న వ్యాఖ్యలకు మహేష్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదం క్రమంగా సౌత్ వర్సెస్ నార్త్ సినీ పోరుగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
- Phani CH
- Updated on: Jun 16, 2026
- 4:17 pm
Varanasi: ఆ 30 నిముషాలు అదిరిపోతుంది.. థియేటర్స్‌లో పూనకాలే.. సంచలన విషయాలు చెప్పిన విజయేంద్రప్రసాద్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇది. అలాగే ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు
- Rajeev Rayala
- Updated on: Jun 6, 2026
- 2:39 pm
వారెవ్వా..! ఈ హీరోయిన్.. మహేష్ బాబు అతిథి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా.!! ఎంత మారిపోయింది
టాలీవుడ్‌లో క్లాసిక్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డికి పేరుంది. అయితే బ్లాక్ బాస్టర్.. లేదంటే అట్టర్ ప్లాఫ్. ప్రముఖ దర్శకుడు.‘కిక్’ సినిమాతో భారీగా వసూళ్లు రాబట్టాడు. మహేశ్ బాబుతో సురేంద్ర రెడ్డి తీసిన అతిథి సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే సినిమాలోని కొన్ని రోల్స్ మాత్రం ఆడియెన్స్‌కు ఇప్పటికీ గుర్తుంటాయి.
- Rajeev Rayala
- Updated on: May 31, 2026
- 4:39 pm
సంస్కారం, వినయంలో ఆ హీరో తోపు.. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యాడు
ప్రముఖ హాస్య నటుడు గుండు సుదర్శన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుండు సుదర్శన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు .
- Rajeev Rayala
- Updated on: May 24, 2026
- 10:25 am