AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వారణాసిలో దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం ఇక 15 నిమిషాల్లోనే!

Varanasi Ropeway: వారణాసిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే అందుబాటులోకి రానుంది. రూ.645 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాశీ రోప్‌వే ద్వారా 45 నిమిషాలు పట్టే ప్రయాణం కేవలం 15 నుంచి 16 నిమిషాల్లోనే పూర్తికానుంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు, ఐదు స్టేషన్ల వివరాలు తెలుసుకోండి.

Watch: వారణాసిలో దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం ఇక 15 నిమిషాల్లోనే!
Varanasi Ropeway
Rajashekher G
|

Updated on: Nov 05, 2026 | 11:31 AM

Share

India’s First Public Transport Ropeway in Varanasi: దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటైన వారణాసి (కాశీ)లో రవాణా వ్యవస్థలో కీలక మార్పు రాబోతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు స్థానిక ప్రజలు, పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వేను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ రోప్‌వే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నగర ప్రయాణ ముఖచిత్రమే మారనుంది.

ప్రస్తుతం వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి గోదౌలియా చౌక్ వరకు వెళ్లాలంటే ట్రాఫిక్ రద్దీని బట్టి సుమారు 45 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. అయితే ఈ రోప్‌వే ప్రారంభమైతే అదే ప్రయాణాన్ని కేవలం 15 నుంచి 16 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించే అవసరం లేకుండా ఆకాశమార్గంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కనువిందు చేయనున్న కాశీ రోప్‌వే ప్రయాణం

రోప్‌వే ప్రారంభానికి ముందే ఓ కంటెంట్ క్రియేటర్‌కు ఇందులో ప్రయాణించే అవకాశం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో రోప్‌వే క్యాబిన్లు, వాటి లోపలి సౌకర్యాలు, ఆకాశం నుంచి కనిపించే వారణాసి అందాలను చూపించారు. ఒక్కో క్యాబిన్‌లో 10 మంది ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. కాశీ విశ్వనాథ ఆలయం, నగరంలోని ప్రసిద్ధ ఘాట్ల సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబించేలా వీటిని రూపొందిస్తున్నారు.

కాశీ రోప్‌వే ప్రాజెక్టు ప్రత్యేకతలు ఇవే

ఈ ప్రాజెక్టును సుమారు రూ.645 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపు 4.2 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ రోప్‌వేలో సుమారు 220 కేబుల్ కార్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల కోసం మొత్తం ఐదు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

  1. వారణాసి కంటోన్మెంట్
  2. కాశీ విద్యాపీఠ్
  3. రథయాత్ర
  4. చర్చ్
  5. గోదౌలియా చౌక్

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బార్తోలెట్ మషీనెన్‌బౌ ఏజీ, భారతదేశానికి చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

రోప్‌వేపై నెటిజన్ల స్పందన

రోప్‌వే వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాశీని ఆకాశం నుంచి చూడటం అద్భుతమైన అనుభూతి అని కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొందరు నగరంలోని భవనాల పైకప్పులకు ఒకే తరహా రంగులు వేస్తే మరింత అందంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే బనారస్‌లోని ఇరుకైన వీధులు, పురాతన ఆలయాలు, స్థానిక మార్కెట్లను కాలినడకన సందర్శించడంలోనే అసలైన అనుభూతి ఉంటుందని మరికొందరు పేర్కొన్నారు. మొత్తంగా కాశీ రోప్‌వే అందుబాటులోకి వస్తే స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు పర్యాటకులకు నగరాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం లభించనుంది.

వీడియో చూడండి…

Follow Us