AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsAppలోనే పిల్లల పరీక్షల రిజల్ట్స్.. తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్ చెప్పిన విద్యాశాఖ!

WhatsApp SA-I Results, SA-I Progress Cards: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై పిల్లల సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-I) పరీక్షల ప్రోగ్రెస్ కార్డులను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాల నమోదుపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

WhatsAppలోనే పిల్లల పరీక్షల రిజల్ట్స్.. తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్ చెప్పిన విద్యాశాఖ!
Progress Cards On WhatsappImage Credit source: AI Chatgpt
Rajashekher G
|

Updated on: Nov 04, 2026 | 12:17 PM

Share

Telangana Education News: ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పురోగతిని తెలుసుకోవడానికి పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే విద్యార్థుల పరీక్షల ఫలితాలు, ప్రోగ్రెస్ కార్డులను తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ సదుపాయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-I) పరీక్షలకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. తమ పిల్లలు పరీక్షల్లో ఎలా రాణించారు? ఏయే సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించారు? చదువులో వారి పురోగతి ఎలా ఉంది? అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ సదుపాయాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ సూచించారు. పిల్లల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని, పాఠశాలలతో సమన్వయం చేసుకుంటూ వారి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రైవేట్ పాఠశాలలకు కీలక ఆదేశాలు

మరోవైపు రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కూడా విద్యాశాఖ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ISMS) పోర్టల్‌లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన పెండింగ్ హాజరు వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెలకు సంబంధించిన హాజరు వివరాలను తరువాతి నెల 1వ తేదీలోపు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేయాలి.

ఈ ప్రక్రియ సక్రమంగా అమలవుతుందో లేదో జిల్లా విద్యాశాఖ అధికారులు (DEOs) పర్యవేక్షించాలని డాక్టర్ నవీన్ నికోలస్ సూచించారు. తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు పెండింగ్ వివరాలను ఆలస్యం చేయకుండా అప్‌డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Follow Us
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. తుఫాను సాయంపై కేంద్రానికి సీఎం లేఖ
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. తుఫాను సాయంపై కేంద్రానికి సీఎం లేఖ
ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?
ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?
గాల్లోకి ఎగిరి మరీ రనౌట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్..!
గాల్లోకి ఎగిరి మరీ రనౌట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్..!
ఆ హీరోయిన్ మూడు సార్లు నా సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది: సూర్య
ఆ హీరోయిన్ మూడు సార్లు నా సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది: సూర్య