AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష బహుమతి.. పూర్తి వివరాలు

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే పలు ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల ప్రత్యేకతను ప్రతిబింబించేలా అధికారిక లోగో, ట్యాగ్‌లైన్‌ రూపొందించేందుకు ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది.

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష బహుమతి.. పూర్తి వివరాలు
Godavari Pushkaralu 2027
Ram Naramaneni
|

Updated on: Nov 22, 2026 | 10:26 PM

Share

తెలంగాణలో జరగనున్న గోదావరి పుష్కరాలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పుష్కరాల ప్రత్యేకతను ప్రతిబింబించేలా అధికారిక లోగో, ట్యాగ్‌లైన్‌ రూపొందించేందుకు ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పోటీల నిర్వహణపై ప్రకటన జారీ చేసింది. గోదావరి నది చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక విశిష్టతతోపాటు పుష్కరాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని సూచించింది. ఆసక్తి ఉన్నవారు తెలుగు, ఆంగ్ల భాషల్లో లేదా రెండు భాషల్లోనూ తమ ప్రతిపాదనలు పంపించవచ్చు. ఉత్తమంగా ఎంపికైన మూడు ఎంట్రీలకు నగదు బహుమతులు అందించనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నారు. మరో 100 మందికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://endowments.ts.nic.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.

8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం

గోదావరి పుష్కరాలకు దాదాపు 8 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనసందోహానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాల సన్నద్ధత, వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజూ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. భక్తుల రాక, అవసరమైన ఏర్పాట్లు, చేపట్టాల్సిన పనులపై సీఎస్‌కు నివేదిక అందించారు.

67 ప్రాంతాల్లో ఏర్పాట్లు

పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 67 ప్రాంతాలను గుర్తించినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు వచ్చే భక్తుల సంఖ్య, ప్రాధాన్యాన్ని బట్టి మూడు విభాగాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ప్రతి ప్రాంతంలో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు.

2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పనుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని సీఎస్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతోపాటు ఇంజినీరింగ్‌ పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావుతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఘాట్ల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు

పుష్కరాల నేపథ్యంలో గోదావరి నది ప్రవహించే తెలంగాణ ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యవంతమైన స్నానఘట్టాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలతోపాటు నది పరివాహక ప్రాంతాల్లో కొత్త ఘాట్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న వాటి అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది. పుష్కరాలకు ముందే నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి..
అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి..
అరటికాయ వేపుడు ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడూ ఇదే చేసుకుంటారు
అరటికాయ వేపుడు ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడూ ఇదే చేసుకుంటారు
తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..
తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..
మీ ఇంటి కిచెన్ లో ఉండే ఈ ముక్కలను ముఖం మీద రుద్దితే మెరిసిపోతుంది
మీ ఇంటి కిచెన్ లో ఉండే ఈ ముక్కలను ముఖం మీద రుద్దితే మెరిసిపోతుంది