AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

భారతదేశంలో నదీ పూజలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆ నదులలో గోదావరి నది తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకమైనది. గంగ తర్వాత పవిత్రతలో రెండో స్థానంలో నిలిచిన గోదావరిని ‘దక్షిణ గంగ’ అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహోత్సవమే గోదావరి పుష్కరాలు. చివరిసారి గోదావరి పుష్కరాలు 2015లో ఘనంగా నిర్వహించారు. అప్పట్లో కోట్లాది మంది భక్తులు గోదావరి తీరాలకు చేరుకున్నారు. తదుపరి గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. ఆ సందర్భంలో కూడా భారీగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు గోదావరి తీరాలకు చేరుకుని పుణ్యస్నానం చేస్తారు.

గోదావరి నదిలో పుష్కర దేవుడు ప్రవేశిస్తాడని పురాణాల్లో విశ్వాసం ఉంది. పుష్కర కాలంలో గోదావరిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ సమయంలో భక్తులు పితృదేవతలకు తర్పణాలు చేసి, దానధర్మాలు చేస్తారు. గోదావరి తీరాల్లో ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, హోమాలు కుటుంబ సమేతంగా నిర్వహిస్తారు. గోదావరి పుష్కరాలు మొత్తం 24 రోజులపాటు కొనసాగుతాయి. మొదటి 12 రోజులను ఆది పుష్కరాలు, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అంటారు. ఈ రెండు కాలాల్లోనూ గోదావరి నదిలో స్నానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు ఎక్కువగా రాజమహేంద్రవరం, భద్రాచలం, బాసర, ధర్మపురికి వెళ్తారు. ఈ ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఘాట్లు, భద్రతా ఏర్పాట్లు చేస్తాయి.

ఇంకా చదవండి
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో