సీక్వెల్స్‌కు గుడ్‌బై.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ప్రీక్వెల్స్ హవా!
భారతీయ సినీ పరిశ్రమలో సీక్వెల్స్‌కు బదులుగా ప్రీక్వెల్స్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. 'సార్పట్ట పరంపరై', 'వేట్టయన్', 'లూసీఫర్', 'కాంతార' వంటి చిత్రాలు కథను గతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. పాత్రల నేపథ్యం, సంఘటనల మూలాలను చూపించే ఈ విధానానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో మరిన్ని భారీ చిత్రాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద సిరీస్‌ల హవా నడుస్తోంది. ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్‌కు బదులుగా ప్రీక్వెల్స్‌ను లైన్‌లో పెడుతున్నారు మన మేకర్స్. కోవిడ్ టైమ్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా సార్పట్ట పరంపరై. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అయితే సెకండ్ పార్ట్‌ను ప్రీక్వెల్‌గా రూపొందించబోతున్నారు. పా రజింత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేట్టయన్ సినిమాకు కొనసాగింపు ప్లాన్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథగా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 2ను కూడా ప్రీక్వెల్‌గానే రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నామని స్వయంగా దర్శకుడు జ్ఞానవేల్ ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. మోహన్‌లాల్ హీరోగా మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లూసీఫర్. మాలీవుడ్ ఇండస్ట్రీల్లో హయ్యస్ట్ గ్రాసర్స్ సరసన నిలిచిన ఈ సినిమాకు పార్ట్ 2ను మరింత భారీగా రూపొందించారు. తొలి భాగాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించిన మేకర్స్, పార్ట్ 2 కథను పూర్తిగా ఖురేషీ అబ్రమ్ బ్యాక్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కన్నడ సీమ నుంచి చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పార్ట్ 2 కూడా ప్రీక్వెల్‌గానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. తమిళనాట ప్రీక్వెల్స్ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. లోకేష్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాల్లో చాలా వరకు ప్రీక్వెల్సే అన్న టాక్ వినిపిస్తోంది. కమల్, శంకర్ కాంబినేషన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఇండియన్ 3 కూడా ప్రీక్వెలే అన్న హింట్ ఇచ్చారు మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్ మనకే వస్తుంది!
ఫ్రూట్స్ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఆరోగ్యం కదా అని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు..

