AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

Phani CH
|

Updated on: Aug 07, 2026 | 5:30 PM

Share

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని సరైన సమయంలో తింటేనే పూర్తి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం శక్తినిచ్చే పండ్లు, మధ్యాహ్నం జీర్ణక్రియకు ఉపయోగపడే పండ్లు, రాత్రి నిద్రకు తోడ్పడే పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. పండ్లను జ్యూస్ కంటే నేరుగా తింటే ఫైబర్ ఎక్కువగా లభించి ఆరోగ్య ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి.

పండ్లు ఆరోగ్యానికి మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు సహజంగా అందుతాయి. అయితే ఒక్కో పండు ద్వారా ఒక్కోరకమైన పోషకాలు లభిస్తాయి. ఇది పక్కన పెడితే.. అసలు పండ్లు ఏ సమయంలో తినాలి? అలా సమయానుసారం తింటేనే శరీరానికి అందే పోషక విలువలు ఆధారపడి ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాదు.. పండ్లను రసాల రూపంలో కాకుండా పండుగా తింటేనే శరీరానికి పూర్తి స్థాయిలో ఫైబర్ అందుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజుకు ఒక సర్వింగ్ అంటే 200-300 గ్రాములు కాగా, పెద్దలు రోజుకు 2-3 సర్వింగ్స్ తీసుకోవడం శ్రేయస్కరం. నిపుణుల ప్రకారం.. ఉదయం అల్పాహారంగా అరటి, యాపిల్, అవకాడో, నారింజ, ద్రాక్ష తినడం వల్ల రోజంతా అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. యాపిల్‌లోని పెక్టిన్ ఆకలిని నియంత్రిస్తే, నారింజలోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే పరగడుపున పుల్లని పండ్లు తింటే ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో జామ, బొప్పాయి, అనాస, మామిడి, ఆలివ్ వంటివి తీసుకోవడం మేలు. బొప్పాయి, అనాస జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తాయి. జామపండు మధుమేహ నియంత్రణకు చక్కగా తోడ్పడుతుంది. ఇక రాత్రి పడుకునే గంట ముందు కివి పండు తింటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అయితే రాత్రివేళ పుచ్చకాయ తింటే మూత్రవిసర్జన ఎక్కువై నిద్రకు భంగం కలిగే ప్రమాదముంది. అధిక రక్తపోటు ఉన్నవారు అరటి, కివి, పుచ్చకాయ తినడం మంచిది. అయితే కిడ్నీ వ్యాధిగ్రస్థులు పొటాషియం ఎక్కువగా ఉండే అరటి, కివి, పుచ్చకాయ, కొబ్బరినీళ్లను వైద్యుల సలహాతోనే పరిమితంగా తీసుకోవాలి. గర్భిణులకు యాపిల్, జామ, దానిమ్మ, నారింజ ఆరోగ్యకరం. పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పక్షవాతం, గుండె జబ్బుల ముప్పును 10-15 శాతం వరకు తగ్గిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరోగ్యం కదా అని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !

రూ.4000 కోట్ల ‘రామాయణం’.. యశ్, రణబీర్‌ల పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా.. అరుదైన రాచనాగు ప్రత్యేకత ఇదే!

నేనూ చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

Follow Us