నేనూ చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం నాసర్‌రెడ్డి నగర్ ఎంపీపీ పాఠశాల తరగతి గదిలోకి భారీ జెర్రిపోతు ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలారు. వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని చంపకుండా నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం నాసర్‌రెడ్డి నగర్ ఎంపీపీ స్కూల్‌లో తీవ్ర కలకలం రేగింది. క్లాస్‌లో పిల్లలు పాఠాలు వింటున్నారు. ఇంతలో క్లాస్‌రూమ్‌లోకి ఓ భారీ జెర్రిపోతు ఎంట్రీ ఇచ్చింది. అంత పెద్ద పామును చూసి విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. పిల్లలు చేసిన హడావిడికి ఆ పాముకూడా భయపడి క్లాస్‌లోని ఓ బెంచ్ వెనక దాక్కుంది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్లికార్జున ఆ జెర్రిపోతును సురక్షితంగా పట్టుకోవడంతో విద్యార్థులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన ఆ పామును పిల్లలకు చూపిస్తూ, పర్యావరణ పరిరక్షణలో పాముల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి మైదాన ప్రాంతంలో వదిలేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాములు, ఇతర విషకీటకాలు రక్షణ కోసం జనావాసాలు, బడులు, పొదల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బడి ఆవరణను, తరగతి గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. విద్యార్థులు చెత్త కుప్పలు, చీకటి ప్రదేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలోకి లేదా స్కూళ్లలోకి పాములు వస్తే వాటిని చంపకుండా వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. ఫైన్ రూ.19 లక్షలు.. కానీ షాకింగ్ ట్విస్ట్!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

