తెలంగాణలో నేటి నుండి బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. ప్రివిలేజ్ ఫీజును 8% నుండి 20%కి పెంచడంపై తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన తెలుపుతోంది. ఈ పెంపు ఒక్కో బార్పై అదనంగా రూ. 30 లక్షల భారం మోపుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు బంద్ కొనసాగుతుందని తెలిపారు.