AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైన్ క్రాస్ చేసిన కార్తీ...తమిళ థియేటర్‌ ఓనర్లు సీరియస్

లైన్ క్రాస్ చేసిన కార్తీ…తమిళ థియేటర్‌ ఓనర్లు సీరియస్

Phani CH
|

Updated on: Oct 05, 2026 | 10:08 PM

Share

తమిళనాడులో థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ మధ్య ఉండాల్సిన విండోపై వివాదం కొనసాగుతున్న వేళ కార్తీ నటించిన ‘సర్దార్ 2’ త్వరగా ఓటీటీలోకి రావడం చర్చకు దారితీసింది. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించింది. 8 వారాల విండో కోసం డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు పోరాడుతున్న సమయంలో ఈ నిర్ణయం కొత్త వివాదానికి కారణమైంది.

తమిళనాడులో ఓటీటీ రిలీజ్ విండో విషయంలో సమస్య కొలిక్కి రాకపోగా.. కార్తీ కారణంగా మరో సారి రగిలింది. 8 వారాల విండో అని మరొకరు, 4 వారాల విండో అని మరొకరు ఎవరి వాదన వారు వినిపిస్తూ.. కోలీవుడ్‌లో రచ్చ చేస్తున్నారు. స్ట్రైక్ చేసేందుకు కూడా రెడీ అయ్యారు. అయితే ప్రభుత్వం కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రస్తుతానికి కామ్ అయ్యింది. కానీ ఈ క్రమంలోనే కార్తీ మరో సారి లైన్ క్రాస్ చేసేశాడు. ఫ్లాప్ సినిమాలకు అన్ని రోజులు కూడా అనవసరం అనుకున్నాడేమో.. ఏమో.. కానీ.. 4 వారాల లోపే తన సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్‌కు ఇచ్చేశాడు. కార్తీ రీసెంట్‌గా సర్దార్2తో అందర్నీ పలకరించాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. అదే రోజు రిలీజైన సూరి, సుహాస్ మూవీ “మండాడి “ఇంకా థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న టైంలో సర్దార్2 ఓటీటీలో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 10న రిలీజైన ఈ మూవీ 20 రోజుల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పై సందడి చేస్తోంది. తమిళనాడులో ఇటు డిస్ట్రిబ్యూటర్స్ అటు థియేటర్ ఓనర్స్ 8 వారాల విండో కోసం పోరాటం నిర్మాతలు నష్టపోతామని ఫైట్ చేస్తుంటే ఈవేమీ పట్టించుకోకుండా వీరి వాదనలకు భిన్నంగా ఓటీటీలోకి సర్ధార్ 2 సినిమాను తీసుకొచ్చాడు కార్తీ. అయితే కార్తీ ఇలా చేస్తే భవిష్యత్తులో అతడి కెరీర్‌కే ముప్పు అంటున్నారు కోలీవుడ్ ట్రేడ్ పండితులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

బట్టలు తీసుకుందామని కబోర్డ్‌ ఓపెన్‌ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్‌ చూసి హడల్‌

ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు

కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు.. అసలేం జరిగిందంటే!

భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం.. ఇదే అసలైన సంస్కారం అంటూ..

Follow Us