AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు

ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు

Phani CH
|

Updated on: Oct 05, 2026 | 10:02 PM

Share

ఫ్లైదుబాయ్‌ విమానంలో కో-పైలట్‌ దాడిని అడ్డుకుని 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరిచి సహాయం పొందేలా చేసిన ఆయన చర్యతో విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్‌లో ల్యాండ్‌ చేశారు. ప్రస్తుతం అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ను దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ పరామర్శించి ఆయన ధైర్యాన్ని కొనియాడారు.

విమానాన్ని కూల్చేసేందుకు కో-పైలట్ చేసిన కుట్రను భగ్నం చేసి, 170 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత సంతతికి చెందిన ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సమయస్ఫూర్తిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం యూఏఈలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న యువరాజు, ప్రమాద సమయంలో స్మిత్ ప్రదర్శించిన సాహసాన్ని కొనియాడారు. అనంతరం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు 170 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానంలో ఈ భయంకర ఘటన జరిగింది. కాక్‌పిట్‌లో ఉన్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ విమానాన్ని దారుణంగా కూల్చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ప్రధాన కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కో-పైలట్ కత్తితో దాడి చేయడంతో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి అతడిని అడ్డుకుంటూనే కాక్‌పిట్ డోర్‌ను తెరవగలిగారు. రక్తపు మడుగులో ఉన్న స్మిత్‌ను గమనించిన అదనపు పైలట్లు వెంటనే విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, సౌదీ అరేబియాలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కెప్టెన్ స్మిత్ తెగువ వల్ల పెను ప్రమాదం తప్పడంతో యావత్ ప్రపంచం ఆయనపై ప్రశంసలు కురిపిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్మిత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుబాయ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్, స్మిత్ వంటి వీరుడు తమ బృందంలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు.. అసలేం జరిగిందంటే!

భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం.. ఇదే అసలైన సంస్కారం అంటూ..

కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!

BSNL: బీఎస్‌ఎన్‌‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్

జింక కోసం మాటువేసిన పులి.. నెమ‌లి ఎంట్రీతో బెడిసికొట్టిన పులి ప్లాన్‌

Follow Us