AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: బీఎస్‌ఎన్‌‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే  24 రోజులు ఉచిత కాల్స్

BSNL: బీఎస్‌ఎన్‌‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్

Phani CH
|

Updated on: Oct 05, 2026 | 4:58 PM

Share

దసరా, దీపావళి సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘ఫ్రీడమ్‌ 2.0’ ఆఫర్‌ను అక్టోబర్‌ 12, 2026 వరకు పొడిగించింది. కొత్త కస్టమర్లు కేవలం రూ.1కే సిమ్‌తో పాటు 24 రోజుల పాటు అపరిమిత కాల్స్‌, రోజుకు 1జీబీ హైస్పీడ్‌ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. కొత్త కనెక్షన్‌ తీసుకునేవారు లేదా బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అయ్యేవారు ఈ ఆఫర్‌ను పొందేందుకు సమీప కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ లేదా అధీకృత రిటైలర్‌ను సంప్రదించాలి.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాబోయే దసరా, దీపావళి పండగల సందర్బంగా ‘ఫ్రీడమ్ 2.0’ పేరుతో బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పరిచయం చేసిన ఈ ఆఫర్ అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.1 చెల్లిస్తే కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు లభిస్తుంది. అంతేకాకుండా, ఈ సిమ్‌తో పాటు 24 రోజుల వ్యాలిడిటీతో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా మాట్లాడుకునేలా ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయం లభిస్తుంది. వీటితో పాటు ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా మరియు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసిన నేపథ్యంలో, అత్యంత చవకైన ధరకే సర్వీసులు అందిస్తూ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌‌ఎల్ ఈ ప్లాన్ తెచ్చింది. ఈ ఆఫర్ కొత్తగా సిమ్ తీసుకునే వారికి మరియు వేరే నెట్‌వర్క్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న పాత వినియోగదారులకు ఇది వర్తించదు. ఈ ఆఫర్ పొందాలనుకునే వారు అక్టోబర్ 12లోగా సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ కేర్ సెంటర్ లేదా గుర్తింపు పొందిన రిటైలర్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డు, కేవైసీ వివరాలు సమర్పించి సిమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!

3D టెక్నాలజీతో పేదల ఇళ్లు.. ఏపీలో 3 లక్షల గృహాలకు శంకుస్థాపన!

మొబైల్ రీఛార్జ్‌తో రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10వేల సైబర్ ప్రొటెక్షన్..

ఒకే ఒక్క సిగరెట్‌.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్‌!

Putin: అక్కడ గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్‌ వార్నింగ్‌

Follow Us