AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడదని ముందే తెలుసు...పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Phani CH
|

Updated on: Oct 05, 2026 | 10:07 PM

Share

పవన్ కల్యాణ్, త్రిష జంటగా నటించిన ‘తీన్‌మార్’ సినిమా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ మాట్లాడుతూ, షూటింగ్ సమయంలోనే సినిమా ఫలితంపై తనకు సందేహాలు కలిగాయని వెల్లడించారు. ‘లవ్ ఆజ్ కల్’ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించడం సులభం కాలేదని, పవన్ స్టార్ ఇమేజ్ కూడా ప్రభావం చూపిందని తెలిపారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ జంటగా వచ్చిన సినిమా ‘తీన్‌మార్’. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. భారీ అంచనాలు, పవన్ క్రేజ్‌తో 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కథ, నేపథ్యం తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తీన్‌మార్ ఫలితం ఎలా ఉండబోతుందో తనకు అర్థమైందని జయంత్ సి. పరాన్జీ చెప్పుకొచ్చారు. షూటింగ్ చేస్తున్నప్పుడే తీన్‌మార్ సినిమా ఆడదని తనకు తెలిసిపోయిందని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే సినిమా ప్రాసెస్‌లో రైటర్ త్రివిక్రమ్‌ను తాను కనీసం ఒక్కసారి కూడా కలవలేదని.. ఆయన ఖలేజా సినిమాతో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చాడు జయంత్ సీ పరాన్జీ. డైరెక్టర్‌గా తాను చివర్లో ఈ మూవీ టీంలో జాయిన్ అయ్యా అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే లవ్ ఆజ్ కల్ కథ బాలీవుడ్ సెన్సిబిలిటీస్, అక్కడి సంస్కృతికి దగ్గరగా ఉంటుందని… అదే కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదంటూ జయంత్ చెప్పుకొచ్చాడు. ఒరిజినల్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న స్టార్ ఇమేజ్‌లోనూ తేడా ఉంది. తీన్‌మార్ సినిమా అక్కడి ప్రేక్షకుల సెన్సిబిలిటీస్‌కు సరిపోయింది, అందుకే అక్కడ హిట్ అయింది. పవన్ లాంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో అలాంటి సబ్జెక్ట్ తీయడం మన ఆడియన్స్‌కు పెద్దగా రుచించలేదు. బెనిఫిట్ షోలు పూర్తయిన తర్వాత కొంతమంది అభిమానులు తన ఇంటి ముందు ఆందోళనకు దిగారని.. సినిమాలోని క్లైమాక్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారంటూ జయంత్ గుర్తు చేసుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బట్టలు తీసుకుందామని కబోర్డ్‌ ఓపెన్‌ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్‌ చూసి హడల్‌

ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు

కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు.. అసలేం జరిగిందంటే!

భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం.. ఇదే అసలైన సంస్కారం అంటూ..

కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!

Follow Us