AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: నేను సన్నీ లియోన్ లాంటోడిని..

Venu Swamy: నేను సన్నీ లియోన్ లాంటోడిని..

Phani CH
|

Updated on: Oct 05, 2026 | 10:09 PM

Share

ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ‘చంద్రయాన్’ సినిమా ప్రెస్ మీట్‌లో తనపై వచ్చే ట్రోలింగ్, వివాదాల గురించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విషయాలను భిన్నంగా చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనను తాను సన్నీ లియోన్‌తో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంట్రవర్సీ వల్లే సోషల్ మీడియాలో హైప్ వస్తుందని వేణు స్వామి చెప్పినట్లు సమాచారం.

సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి అగ్గి రాజేశారు. తనపై వచ్చే ట్రోలింగ్స్, కాంట్రవర్సీలపై ఎవరూ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. రీసెంట్‌గా జరిగిన ‘చంద్రయాన్’ సినిమా ప్రెస్ మీట్‌లో వేణు స్వామి.. సన్నీ లియోన్‌తో పోల్చుకుని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. సినిమా ఈవెంట్‌లో ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెబుతూ… తెలుగు రాష్ట్రాల్లో బ్రతకడం అంటే 2+2=4 కాదు.. 2+2=5 అనాల్సిందే! అంటూ వేణు స్వామి ఆన్సర్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తాను సన్నీ లియోన్ లాంటోడినని.. ఇక తన కొత్తగా విప్పడానికి ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎక్కడ ఎవరు దొరుకుతారా అని చూసేవాళ్లు, హైప్ కోసం చూసే జర్నలిస్టులు ఉన్నప్పుడు.. కాంట్రవర్సీ చేస్తేనే సోషల్ మీడియాలో పైకి వెళ్తాం కదా అంటూ ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్టే చెప్పుకొచ్చారు వేణుస్వామి. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లైన్ క్రాస్ చేసిన కార్తీ…తమిళ థియేటర్‌ ఓనర్లు సీరియస్

ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

బట్టలు తీసుకుందామని కబోర్డ్‌ ఓపెన్‌ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్‌ చూసి హడల్‌

ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు

కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు.. అసలేం జరిగిందంటే!

Follow Us