100 కోట్ల హిట్టు కొట్టిన హీరో.. కనిపించడం లేదేంటి?
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో హిట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ వంటి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న వైష్ణవ్.. తనకు సరిపోయే కథ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. బేబమ్మగా కృతి, ఆసీగా వైష్ణవ్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తొలి సినిమాతోనే వైష్ణవ్ టాలీవుడ్‌లో హిట్ హీరోగా ముద్ర వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం ఉప్పెన స్థాయి విజయాన్ని వైష్ణవ్ తేజ్ అందుకోలేకపోయాడు. విభిన్న కథలు, జానర్లను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాడు. ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. దీంతో వైష్ణవ్ కెరీర్ విషయంలో కొంత గ్యాప్ ఏర్పడింది. వైష్ణవ్ దాదాపు మూడేళ్లుగా సినిమా చేయలేదు. అయితే అవకాశాలు లేకపోవడం వల్లే ఈ గ్యాప్ రాలేదట. తనకు సరిగ్గా సరిపోయే కథ, పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్నప్పటికీ.. ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ఫైనల్ చేయలేదు. ఈ మూడేళ్లలో చాలా కథలే విన్నట్లు తెలుస్తోంది. తొలి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన వైష్ణవ్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో తదుపరి చేయబోయే సినిమా ఆయన కెరీర్‌కు అత్యంత కీలకంగా మారనుంది. వైష్ణవ్ ఎలాంటి కథను ఎంచుకుంటాడు? ఎవరితో కలిసి పనిచేస్తాడు? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సరైన కథతో వైష్ణవ్ మళ్లీ బౌన్స్‌బ్యాక్ అవుతాడేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీకు ప్రాణ హాని ఉందని చెబితే.. సల్మాన్ లైట్ తీసుకున్నాడు
Venu Swamy: నేను సన్నీ లియోన్ లాంటోడిని..
లైన్ క్రాస్ చేసిన కార్తీ…తమిళ థియేటర్ ఓనర్లు సీరియస్
ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
బట్టలు తీసుకుందామని కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

