సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకున్న ఓ సంచలన వివాదం ప్రస్తుతం వైరల్‌గా మారింది. డబుల్ ఇస్మార్ట్ పంపిణీ హక్కుల విషయంలో పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ల వల్ల తాము రూ.35 నుండి 40 కోట్ల వరకు నష్టపోయామని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ అధినేత చైతన్య రెడ్డి ఆరోపించారు. పూరీ, ఛార్మీ తమను ముంచేశారని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.