హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పుట్టినరోజు వేడుక తీరని విషాదంగా మారింది. ఆరేళ్ల చిన్నారి సరాక్షి, ఆమె బంధువు విశ్వంత్ లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున కేక్ కటింగ్ కోసం వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సంతోషంగా మొదలైన వేడుక తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.