ఆరోగ్యం కదా అని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!
వాంతులు, విరోచనాల సమయంలో శరీరంలో నీరు, లవణాల సమతుల్యతను కాపాడటానికి అసలైన ఓఆర్ఎస్‌నే ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే టెట్రా ప్యాక్ పానీయాలు ఓఆర్ఎస్ కాదని, వాటిలో చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న ఓఆర్ఎస్ పొడినే ఒక లీటర్ నీటిలో కలిపి 24 గంటల్లోపు వినియోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు, పెద్దలకు వాంతులు, విరోచనాలు అయినప్పుడు శరీరంలో నీరు, లవణాల శాతాన్ని కాపాడేందుకు ఓఆర్‌ఎస్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే మార్కెట్లో టెట్రా ప్యాకెట్లలో రకరకాల రుచుల్లో లభించే పానీయాలు అసలైన ఓఆర్ఎస్ కాదని, అవి కేవలం సాధారణ ఫుడ్ డ్రింక్స్ మాత్రమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన ఓఆర్ఎస్ పొడి ప్యాకెట్లను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. టెట్రా ప్యాకెట్లలో రుచి కోసం చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా కలుపుతారని.. ఇవి డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉండవని స్పష్టం చేశారు. నిజమైన ఓఆర్ఎస్‌లో సోడియం, పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్, డెక్స్‌ట్రోజ్ వంటి ముఖ్యమైన లవణాలు సరైన మోతాదులో ఉంటాయని తెలిపారు. ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను ఒక లీటర్ కాచి చల్లార్చి, వడపోసిన నీటిలో కలపాలి. 24 గంటల లోపు అవి తాగించాలి. వాంతులు అవుతున్నప్పుడు వైద్యుల సలహాతో వాటిని అరికట్టే మందులు వేసి ఆ తర్వాత ఓఆర్ఎస్ ఇవ్వవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లోనే కాచి చల్లార్చిన నీటిలో చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి ఇవ్వవచ్చని, లేదా కొబ్బరి నీళ్లు పట్టించడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !
రూ.4000 కోట్ల ‘రామాయణం’.. యశ్, రణబీర్‌ల పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా.. అరుదైన రాచనాగు ప్రత్యేకత ఇదే!
నేనూ చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు..

