AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.4000 కోట్ల 'రామాయణం'.. యశ్, రణబీర్‌ల పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

రూ.4000 కోట్ల ‘రామాయణం’.. యశ్, రణబీర్‌ల పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

Phani CH
|

Updated on: Aug 07, 2026 | 4:22 PM

Share

నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’లో నటీనటుల పారితోషికాలు చర్చనీయాంశంగా మారాయి. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, సన్నీ డియోల్, రవి దూబేలకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మొత్తాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ధృవీకరణ లేదు.

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ విజువల్ వండర్ రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద స్టార్ కాస్టింగ్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులు తీసుకుంటున్న పారితోషికాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పౌరాణిక ఘట్టంలో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, ఒక్కో భాగానికి రూ. 75 కోట్ల చొప్పున రెండు భాగాలకు కలిపి రూ. 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అలాగే రావణాసురుడి పాత్ర పోషిస్తూ, చిత్ర సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్, ఒక్కో భాగానికి రూ. 50 కోట్లు చొప్పున మొత్తం రూ. 100 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఇక సీతాదేవిగా నటిస్తున్న సౌత్ స్టార్ సాయి పల్లవి ఒక్కో భాగానికి రూ. 6 కోట్ల చొప్పున రెండు భాగాలకు కలిపి రూ. 12 కోట్లు అందుకుంటోంది. హనుమంతుడి పాత్రలో కనిపిస్తున్న సన్నీ డియోల్ రెండు భాగాలకు కలిపి రూ. 40 కోట్లు , లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న బుల్లితెర నటుడు రవి దూబే రూ. 20 కోట్లు తీసుకుంటున్నారు. మరోవైపు విద్యుత్‌జిహ్వ పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా నటిస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ చక్రవర్తి దశరథుడిగా కనిపించనుండగా.. లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన వంటి దిగ్గజ తారలు ఇతర ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులలో భారీ అంచనాలను సృష్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా.. అరుదైన రాచనాగు ప్రత్యేకత ఇదే!

నేనూ చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. ఫైన్ రూ.19 లక్షలు.. కానీ షాకింగ్ ట్విస్ట్!

Follow Us