AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

Phani CH
|

Updated on: Aug 07, 2026 | 5:40 PM

Share

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం జూలై నెలలో చరిత్రలోనే అత్యధికంగా నమోదైంది. 24.52 లక్షల మంది భక్తులు దర్శించుకోగా రూ.140.28 కోట్ల కానుకలు హుండీ ద్వారా వచ్చాయి. లడ్డూ విక్రయాలు కూడా కొత్త రికార్డు సృష్టించాయి. ఒకే నెలలో 1.30 కోట్లకు పైగా లడ్డూలు విక్రయించి, భక్తులకు ఎలాంటి కొరత లేకుండా టీటీడీ సమర్థంగా పంపిణీ చేసింది.

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను బ్రేక్ చేస్తోంది. జూలై నెలలో హుండీ ఆదాయం టీటీడీ చరిత్రలోను సరికొత్త రికార్డు ను నెల కొల్పింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు ఎప్పటికప్పుడు రికార్డులను తిరగరాస్తుండగా, జూలై నెలలో వచ్చిన హుండీ ఆదాయం ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ ఏడాది జూన్ నెలలో 25.26 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, టీటీడీకి రూ. 128.29 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఇది రూ. 8.44 కోట్లు ఎక్కువ. కాగా, జూలై నెలలో భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం భారీగా సమకూరింది. జూలై 1 నుంచి 31 వరకు 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రికార్డు స్థాయిలో రూ. 140.28 కోట్ల కానుకలు హుండీ ద్వారా లభించాయి. గతేడాది జూలై నెలలో వచ్చిన రూ. 129.45 కోట్లతో పోలిస్తే ఇది అత్యధికం. జూలై 16న ఒక్కరోజే గరిష్టంగా రూ. 5.31 కోట్లు రాగా, నెలలో మొత్తం 5 సార్లు రోజువారీ ఆదాయం రూ. 5 కోట్లు దాటింది. మరో 21 రోజుల పాటు రోజుకు రూ. 4 కోట్లకు పైగా కానుకలు నమోదయ్యాయి. శ్రీవారి దర్శనంతో పాటు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం విక్రయాల్లోనూ టీటీడీ రికార్డులను బ్రేక్ చేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాల తయారీని విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా పంపిణీ చేసింది. ఈ ఏడాది జూన్ నెలలో 1.27 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, జూలై నెలలో ఏకంగా 1,30,86,278 లడ్డూలను భక్తులకు విక్రయించారు. టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో 1.31 కోట్లకు పైగా లడ్డూలను తయారు చేసి భక్తులకు నిరంతరాయంగా అందించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చేపట్టిన ముందస్తు చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ఆరోగ్యం కదా అని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !

రూ.4000 కోట్ల ‘రామాయణం’.. యశ్, రణబీర్‌ల పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

Follow Us