AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: మృణాల్ కెరీర్‌కు బ్రేక్ ఎందుకు..? అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణాలివే!

Mrunal Thakur: మృణాల్ కెరీర్‌కు బ్రేక్ ఎందుకు..? అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణాలివే!

Phani CH
|

Updated on: Aug 07, 2026 | 6:19 PM

Share

'సీతారామం'తో టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అందుకున్న మృణాల్ ఠాకూర్‌కు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. పెరిగిన పారితోషికం, వరుస సినిమాల నిరాశాజనక ఫలితాలు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం చేతిలో పెద్ద ప్రాజెక్టులు లేకపోవడంతో మృణాల్ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే కథల ఎంపికతో పాటు పారితోషిక విషయంలోనూ వ్యూహం మార్చాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సౌత్‌లో తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్‌, ఆ తరువాత ఆ జోరు కంటిన్యూ చేయటంలో తడబడ్డారు. కెరీర్లో హాయ్‌ నాన్న లాంటి సక్సెస్‌లు ఉన్నా… స్టార్‌ లీగ్‌లోకి ఎంటర్‌ అయ్యే రేంజ్‌లో మాత్రం ప్రూవ్ చేసుకోలేదు. పోనీ నార్త్‌లో అయినా కెరీర్‌ ఫామ్‌లో ఉందా అంటే అదీ లేదు. అసలు మృణాల్‌ కెరీర్‌కు అడ్డుపడుతున్న అంశాలేంటి..? ఈ స్టోరీలో చూద్దాం. ఇండస్ట్రీలో హిట్ కొడితే రెమ్యునరేషన్ పెంచేయడం అన్నది కామన్‌. సీతారామం, హాయ్ నాన్న సూపర్ హిట్స్ తర్వాత మృణాల్ కూడా తన ఫీజును భారీగా పెంచేశారట. ఒక్కో సినిమాకు ఏకంగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ముంబై నుంచి వచ్చే ఆమె పర్సనల్ స్టాఫ్ ఖర్చులు కూడా నిర్మాతలకు భారంగా మారుతున్నాయట. విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవ్వటంతో టాలీవుడ్‌లో మృణాల్ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మేకర్స్ కాస్త ఆలోచనలో పడ్డారు. పైగా పాన్-ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్న నిర్మాతలు.. హీరోయిన్ల పారితోషికం, మార్కెట్ రికవరీ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. దీంతో మృణాల్‌కు అవకావాలు తగ్గిపోయాయి. రీసెంట్‌గా డెకాయిట్‌ మూవీతో చేసిన ప్రయోగం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో అమ్మడి కెరీర్‌ మరింత కష్టాల్లో పడింది. ఆల్రెడీ రెమ్యూనరేషన్ డిమాండ్స్ కారణంగా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ టైమ్‌లో వరుస ఫెయిల్యూర్స్ కెరీర్‌ను మరింత ఇబ్బందిల్లోకి నెట్టేశాయి. ప్రజెంట్ ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పటికే ఆలస్యమైన పూజ మేరీ జాన్‌ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రాకా సినిమాలో నటిస్తున్నా.. మెయిన్‌ హీరోయిన్‌గా కాదు. ఈ పరిస్థితుల్లో మృణాల్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కాస్త తగ్గితేనే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ సజెన్స్‌ను మృణాల్‌ ఎంత వరకు కన్సిడర్ చేస్తారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ఆరోగ్యం కదా అని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !

Follow Us