యూపీలోని ఫతేపూర్‌లో పెంపుడు కుక్కను కొట్టారని 19 ఏళ్ల తనూ కేసర్వాని తన పెళ్లిని పీటల మీదే రద్దు చేసుకుంది. కుక్కపై దాడి తన పట్ల అగౌరవంగా భావించిన యువతి, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అవమానించవచ్చని భయపడి ఈ నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో తీసుకున్న ఆమె నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.