అనంతపురం జిల్లా దెంతలపల్లిలోని ఓ అరటి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువ కనిపించి కూలీలను భయభ్రాంతులకు గురిచేసింది. తోట యజమాని భాస్కర్ రెడ్డి సమాచారంతో ప్రముఖ స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డి చాకచక్యంగా దానిని బంధించారు. అనంతరం ఆ కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.