AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brand Value: క్రికెట్‌కు దూరమైనా క్రేజ్‌లో తగ్గేదేలే.. రిటైర్‌మెంట్ తర్వాత కూడా సచిన్ బ్రాండ్ సత్తా ఇదే

Brand Value: క్రికెట్‌కు వీడ్కోలు పలికి దశాబ్దం దాటినా సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 125.9 మిలియన్ డాలర్ల విలువతో ధోనీని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ 158.4 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, సచిన్ ఆదాయ మార్గాలు ఇవే.

Brand Value: క్రికెట్‌కు దూరమైనా క్రేజ్‌లో తగ్గేదేలే.. రిటైర్‌మెంట్ తర్వాత కూడా సచిన్ బ్రాండ్ సత్తా ఇదే
Sachin
Rakesh
|

Updated on: Aug 08, 2026 | 1:24 PM

Share

Brand Value: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి పదేళ్లకు పైగా పూర్తయింది. ఆయన 2013 నవంబర్ 16న క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా సచిన్ ప్రాచుర్యం, క్రేజ్, సంపాదన నిరంతరం పెరుగుతూనే ఉండటం విశేషం. ఆట నుంచి పూర్తిగా తప్పుకున్నప్పటికీ, నేటికీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెటర్లలో ఒకరిగా సచిన్ తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు.

విరాట్ కోహ్లీ అగ్రస్థానం.. ధోనీని దాటేసిన సచిన్

ఇటీవల విడుదలైన సెలబ్రిటీ బ్రాండ్ వేల్యూయేషన్ రిపోర్ట్ 2025 ప్రకారం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 125.9 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 1,000 కోట్లకు పైగా) నమోదైంది. అత్యంత ధనవంతులైన భారతీయ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ 158.4 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 1,500 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా, సచిన్ రెండో స్థానంలో నిలిచారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 115.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో మూడో స్థానంలో ఉన్నారు. మన దేశంలో 100 మిలియన్ డాలర్లకు పైగా బ్రాండ్ వాల్యూ కలిగిన క్రికెటర్లు ఈ ముగ్గురు మాత్రమే కావడం విశేషం.

క్రికెటర్ల బ్రాండ్ వ్యాల్యూ నివేదిక:

విరాట్ కోహ్లీ: $158.4 మిలియన్ డాలర్లు

సచిన్ టెండూల్కర్: $125.9 మిలియన్ డాలర్లు

ఎంఎస్ ధోనీ: $115.3 మిలియన్ డాలర్లు

సచిన్ ఆదాయ మార్గాలు ఇవే

క్రికెట్ ఆడే రోజుల్లో మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టుల ద్వారా సంపాదించిన సచిన్, రిటైర్మెంట్ తర్వాత కూడా భారీగా ఆర్జిస్తున్నారు. వ్యాపార పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ఆయన ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. సచిన్ టెండూల్కర్ సొంతంగా SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అనే సంస్థను ఆగస్టు 2015లో ప్రారంభించారు. వీటితో పాటు లుమినస్ టెక్నాలజీస్, జిల్లెట్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక దిగ్గజ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కేవలం బ్రాండ్ ప్రకటనల ద్వారానే సచిన్ ఏడాదికి రూ. 18 నుంచి 20 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఇంకా ఐపీఎల్, ఇతర ఫార్మాట్లలో యాక్టివ్‌గా ఉంటూ ఆడగా, ఏ లీగ్స్ ఆడని సచిన్ వారి సరసన నిలవడం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us