PM Modi: ఆనందంగా ఉంది.. ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో
న్యూఢిల్లీలోని ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 3,000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వీరిలో 587 మంది పీహెచ్‌డీ పరిశోధకులు ఉన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రధాని మోదీ ప్రదానం చేయనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) లో జరిగే 57వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 3,000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ విద్యార్ధులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ పేర్కొన్నారు. దీంతోపాటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సోనిపట్ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత అత్యున్నత పనితీరు గల సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకలో 587 మంది పీహెచ్‌డీ పరిశోధకులతో సహా మొత్తం 3,000 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు.
ప్రధానమంత్రి మోదీ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా ఐఐటి ఢిల్లీ ప్రతిష్టాత్మక విద్యా పురస్కారాలను కూడా ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాలలో రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం, శంకర్ దయాళ్ శర్మ స్వర్ణ పతకం, పర్ఫెక్ట్ టెన్ స్వర్ణ పతకం ఉన్నాయి.
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
