సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
చైనా శాస్త్రవేత్తలు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో భారీ బంగారం, వెండి నిక్షేపాలను గుర్తించారు. సముద్రం అడుగున 700 నుంచి 1500 మీటర్ల లోతులో హైడ్రో థర్మల్ వెంట్స్ ప్రాంతాలను పరిశీలించి, అరుదైన ఖనిజాలు, జీవరాశులను కనుగొన్నారు. ఈ అన్వేషణ భవిష్యత్తు మైనింగ్‌లో కొత్త మార్పులకు దారితీయనుంది.
భూమిపై గనులు తవ్వి ఖనిజాలను వెలికితీయడం సాధారణమే కానీ, చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఏకంగా సముద్ర గర్భంలోనే భారీ బంగారు, వెండి నిక్షేపాలను గుర్తించారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన ఈ అన్వేషణ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన సింగువా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఆగస్టులో 18 రోజుల పాటు పశ్చిమ పసిఫిక్‌లో సముద్ర అన్వేషణ చేపట్టింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన డీప్ సీ విజువల్ శాంప్లర్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్ సహాయంతో సముద్ర గర్భాన్ని పరిశీలించారు. సముద్రం అడుగున 700 నుంచి 1500 మీటర్ల లోతులో ఉన్న హైడ్రో థర్మల్ వెంట్స్ ప్రాంతాలను గుర్తించారు. అక్కడ నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. ఆ ప్రాంతం నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా, భూభాగంలోని సాధారణ ఖనిజాలకంటే అత్యధిక స్థాయిలో బంగారం, వెండి ఉన్నట్లు తేలింది. ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 15.4 గ్రాముల బంగారం, అలాగే 1.271 కిలోల వెండి ఉన్నట్లు గుర్తించారు.అంతేకాకుండా, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో రొయ్యలు, పీతలు వంటి అరుదైన జీవరాశులు జీవించడం విశేషం. ఈ జీవుల జన్యు వనరులు బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధనలకు ఉపయోగపడే అవకాశం ఉంది. సముద్ర గర్భం నుంచి ఖనిజాలను వెలికితీయడంలో అధునాతన సాంకేతికత అవసరమని, పర్యావరణ ప్రభావాలపై కూడా ఆందోళనలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ, చైనా చేపట్టిన ఈ సరికొత్త సముద్ర అన్వేషణ, భవిష్యత్తులో మైనింగ్ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టేలా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
బిగ్ బాస్ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది
నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు

