AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్‌ అద్భుతం!

మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్‌ అద్భుతం!

G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 14, 2026 | 10:57 PM

Share

వినాయక నవరాత్రుల్లో వరంగల్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ శ్రీరామోజు జయకుమార్‌ రూపొందించిన సూక్ష్మ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మర్రి ఆకుపై కేవలం 2 సెంటీమీటర్ల పరిమాణంలో బాల గణపతిని మట్టితో తీర్చిదిద్దారు. గణపతి చుట్టూ అతిచిన్న ఉండ్రాళ్లను కూడా నైవేద్యంగా ఉంచారు. గత 18 ఏళ్లుగా పర్యావరణహిత మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్న జయకుమార్‌, సూక్ష్మ కళలో పలు అద్భుతాలు సృష్టించి జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు.

వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తులు విభిన్న ఆకారాలు రూపాలలో గణపయ్య పై వారి భక్తిని చాటుకుంటున్నారు.. ఒకరిని మించి మరొకరు ఎత్తైన భారీ విగ్రహాలు అబ్బురపరిచే ఆకారాలతో భక్తులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. వరంగల్ కు చెందిన ఓ భక్తుడు అతి సూక్ష్మ పరిమాణంలో గణపతిని ఆకుపై తయారు చేశాడు.. అదే ఆకుపై గణపతి విగ్రహం చుట్టూ ఉండ్రాలు సమర్పించాడు.. వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ వినూత్న రీతిలో గణపతిపై తన భక్తిని చాటాడు.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతిని పూజించాలంటూ గత 18 ఏళ్లుగా వినూత్న ఉద్యమం చేస్తున్నాడు.. అతిసూక్ష్మ గణపతులను రూపొందిస్తున్నారు.. అతి సూక్ష్మ పరిమాణంలో అనేక అద్భుతాలు సృష్టించి జాతీయ స్తాయికి అవార్డు పొందాడు ఈ మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్…ప్రతి ఏడాది విభిన్న ఆకృతుల్లో గణపతి విగ్రహాలను తయారుచేస్తున్న ఆయన.. ఈసారి మరింత ప్రత్యేకంగా వటపత్రం అంటే (మర్రి ఆకు)పై కేవలం 2 సెంటీమీటర్ల పరిమాణంలో బాల గణపతిని రూపొందించాడు. చిన్నారి గణపతిని ఒడిలో పెట్టుకుని ఉండ్రాళ్లతో లాలిస్తున్నట్టుగా ఈ సూక్ష్మ కళాఖండాన్ని తీర్చి దిద్దాడు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సందేశం ఇస్తూ జయకుమార్ రూపొందించిన ఈ వినూత్న గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆకుపై అతిసూక్ష్మ పరిమాణంలో గణపతిని ప్రతిష్టించడమే కాదు… ఆ విగ్రహం చుట్టూ అతిచిన్న ఉండ్రాలను కూడా నైవేద్యం సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Follow Us