రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన యువ రైతు దూలం ధనరాజు రెండేళ్ల శ్రమతో మొక్కలతో వృక్ష గణపతిని రూపొందించారు. సుమారు 9 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇనుప తీగలతో గణపతి ఆకారాన్ని రూపొందించి, నాలుగు మాల్ఫీజియా మొక్కలను అమర్చి వాటిని ఆకృతికి అనుగుణంగా పెంచారు. ఈ వృక్ష గణపతిని పవన్ కల్యాణ్‌కు బహుమతిగా ఇవ్వాలని ధనరాజు కోరుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో యువ రైతు దూలం ధనరాజు రెండేళ్ల శ్రమతో మొక్కలతో వృక్ష గణపతిని రూపొందించారు. 9 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గణపతిని పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో ఒక యువ రైతు మొక్కలతో గణపతిని రూపొందించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. నర్సరీలో కొలువుదీరిన ఈ వృక్ష గణపతి వినాయక చవితి సందర్భంగా ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పొట్టిలంకలోని మురుగన్ నర్సరీకి చెందిన రైతు దూలం ధనరాజు ఈ అరుదైన గణపతి ప్రతిమను తయారు చేశారు. మొక్కలతో వివిధ ఆకృతులను తయారు చేయాలనే ఆసక్తితో నర్సరీ రంగంలోకి వచ్చిన ఆయన, ఈ వృక్ష గణపతిని తయారు చేయడానికి రెండేళ్ల పాటు శ్రమించాను అంటున్నారు. ఈ వృక్ష గణపతి సుమారు 9 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉంది. ముందుగా ఇనుప తీగలతో గణపతి ఆకారాన్ని రూపొందించి, దానికి నాలుగు మాల్ఫీజియా జాతి మొక్కలను అమర్చారు. ఆ మొక్కలు గణపతి ఆకారాన్ని అనుసరించి పెరిగేలా ప్రతిరోజూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొమ్మలను అవసరమైన విధంగా మలుస్తూ, కత్తిరిస్తూ రెండేళ్ల పాటు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..
కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?
Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్
Epic: ఎపిక్ సూపర్ కలెక్షన్స్.. డే1 ఎంతంటే?
Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

