AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య! వినాయకుడు స్పెషల్‌ అట్రాక్షన్‌

లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య! వినాయకుడు స్పెషల్‌ అట్రాక్షన్‌

Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 14, 2026 | 11:03 PM

Share

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో లక్ష గోల్డ్‌ ఇమిటేషన్‌ లక్ష్మీకాసులతో రూపొందించిన 12 అడుగుల శ్రీలక్ష్మీకాసుల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆర్యవైశ్య గణేష్‌ ఉత్సవ కమిటీ 34వ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే రోడ్డులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇలాంటి విగ్రహాలు నిజమైన బంగారంతో కాకుండా ఇమిటేషన్‌ మెటీరియల్‌, గోల్డ్‌ ప్లేటింగ్‌తో రూపొందిస్తారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులో ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ 34వ వార్షికోత్సవం సందర్బంగా లక్ష గోల్డ్ ఇమిటేడ్ లక్ష్మీ కాసులతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసారు… 12 అడుగుల శ్రీలక్ష్మీ కాసుల వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు… చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు లక్ష్మీకాసుల వినాయకుణ్ణి దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. గోల్డ్ ఇమిటేషన్ లక్ష్మీకాసులతో తయారుచేసిన వినాయక విగ్రహాలు వినాయక చవితి నాడు అక్కడక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది… ఈ విగ్రహాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, సంప్రదాయబద్ధంగా ఉంటాయి… విగ్రహం పీఠం చుట్టూ లేదా వినాయకుని వెనుక ప్రభావళి రూపంలో చిన్న లక్ష్మీ కాసులను అమర్చడం ఒక పద్దతి అయితే గోల్డ్ కోటింగ్‌తో తయారయ్యే విగ్రహాలు మరో పద్దతి… ఇవి పూర్తి బంగారం కావు… రాగి, వైట్‌ మెటల్‌ లేదా రెసిన్ వంటి బేస్ మెటీరియల్ పై నాణ్యమైన గోల్డ్ ప్లేటింగ్, ఇమిటేషన్ పాలిష్ చేస్తారు… కొన్ని విగ్రహాలపై రంగుల మీనా వర్క్, చిన్న ఆర్టిఫిషియల్ స్టోన్స్ పొందుపరుస్తారు… వినాయక చవితి పండుగ సందర్భంగా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం మండపాలకు మరింత శోభనిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Follow Us