AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనాలు స్పెషల్‌.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..!

బోనాలు పండగ స్పెషల్ విందు భోజనాలు.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బోనాల సందర్భంగా దాదాపుగా అందరి ఇళ్లల్లోనూ మేకలు, నాటు కోళ్లను కోస్తుంటారు. లంచ్‌ వరకు లేట్‌ అవుతుంది. కాబట్టి.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌లో చాలా వరకు కోడి కూర పూరీలు ఎక్కువగా తింటారు. అయితే, ఆయిల్‌ ఎక్కువగా పీల్చుకుంటాయని, టైమ్‌ ఎక్కువగా తీసుకుంటాయని పూరీలు చేసేందుకు భయపడే వారికి ఈజీ టిప్‌ ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ట్రిక్‌ ట్రై చేశారంటే.. ఇంటిల్లిపాదికి సరిపడా హెల్తీ పూరీలు నిమిషాల్లో చేసేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

బోనాలు స్పెషల్‌.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..!
Indian Breakfast Recipes
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2026 | 2:03 PM

Share

సాధారణంగా ఉదయపు అల్పాహారంలో వేడివేడిగా ఉబ్బిన పూరీలు ఉంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. అయితే పూరీలను నూనెలో బాగా వేయించడం వల్ల అందులో క్యాలరీలు, చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, డయాబెటిస్ బాధితులు పూరీలకు దూరంగా ఉంటారు. కానీ, అస్సలు నూనె వాడకుండా ప్రెషర్ కుక్కర్ సహాయంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పూరీలు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ వినూత్న పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం.

నూనె లేని పూరీ తయారీ విధానం:

ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, తగినంత నీరు పోసి సాధారణంగా పూరీలకు కలిపినట్లే కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ కర్రతో సన్నని పూరీల్లా ఒత్తుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో అడుగు భాగంలో కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. దానిపైన ఆవిరి మీద ఉడికే చిల్లుల పళ్ళెం లేదా ఇడ్లీ పాత్ర ఉంచాలి. లేదంటే, ఒక ప్లేట్ కు నూనె రాసి కూడా పెట్టొచ్చు. పూరీలు అంటుకోకుండా ఉండటానికి. పూరీలను ఈ ప్లేట్ పై ఉంచి కుక్కర్ లోని స్టాండ్ పై ఈ ప్లేట్ ఉంచండి. తరువాత కుక్కర్ మూత మూసివేసి విజిల్ తీయండి. తరువాత 3 నుండి 5 నిమిషాలు ఉడికించాలి. ఆవిరి పూరీలు సరిగ్గా ఉబ్బి ఉడికిపోతాయి. కుక్కర్‌లోని వేడి ఆవిరి వల్ల పూరీలు నూనెలో వేగనప్పటికీ చాలా త్వరగా, మెత్తగా ఉబ్బుతాయి. కొద్ది నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన ఆవిరి పూరీలు రెడీ.

నూనెలో వేయించకపోవడం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరవు. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉండదు. నూనె లేకపోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగకుండా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవిరి మీద ఉడికిన ఆహారం త్వరగా అరుగుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. సాంప్రదాయ రుచిని కోల్పోకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునే వారికి ఈ నూనె లేని కుక్కర్ పూరీ రెసిపీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us