AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కా నీకు హ్యాట్సాఫ్..! అర్ధరాత్రి 3 గంటలకు ఆటో నడుపుతున్న మహిళా..కారణం తెలిస్తే దండం పెట్టాల్సిందే!

సాధారణంగా, తెల్లవారుజామున 3 గంటలకు దాదాపుగా ప్రజలంతా ఇళ్లలో గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. పగటిపూటతో పోలిస్తే వీధులు కూడా చాలా నిర్మానుష్యంగా ఉంటాయి. అటువంటి సమయంలో ఒక మహిళ ఆటోరిక్షా నడుపుతూ కనిపిస్తే, ప్రజలు ఆమెను గమనించడం సహజం. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సన్యం గార్గ్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతను తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక మహిళ, ఆమె భర్త ఆటో-రిక్షా నడుపుతూ కనిపించారు. అతను ఆగి వారితో మాట్లాడగా, వారి జీవితాల గురించి తెలుసుకున్న విషయాలు అతన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ రోజున తనకు ఎదురైన అనుభవాన్ని సన్యం తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

అక్కా నీకు హ్యాట్సాఫ్..! అర్ధరాత్రి 3 గంటలకు ఆటో నడుపుతున్న మహిళా..కారణం తెలిస్తే దండం పెట్టాల్సిందే!
Midnight Emergency Service
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2026 | 12:49 PM

Share

మన సమాజంలో మానవత్వం, సేవా భావం ఇంకా జీవించే ఉన్నాయని నిరూపించే సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. గుజరాత్‌లోని వడోదర నగరానికి చెందిన ఒక మహిళా ఆటో డ్రైవర్ సరిగ్గా అలాంటి స్ఫూర్తిదాయకమైన పనితో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. పగటిపూట తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడిపే ఈ మహిళ, అర్ధరాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఉచితంగా ప్రయాణ సేవలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు.

ఆ మహిళ భర్త స్వయంగా ఆటో-రిక్షా నడిపేవాడని సన్యం వీడియోలో వివరించారు. అయితే అతను తన సంపాదనను కేవలం తనకే పరిమితం చేసుకోలేదు. ఆమె సొంత కాళ్లపై తాను నిలబడాలని, ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదని అతను తన భార్యకు కూడా డ్రైవింగ్ నేర్పించాడు. ఆ మహిళ డ్రైవింగ్ నేర్చుకుని, క్రమంగా ఆటో-రిక్షా నడపడం ప్రారంభించింది. ప్రస్తుతం, ఆమె పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో, వారు కుటుంబం, ఉద్యోగం రెండింటి బాధ్యతలను మోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అర్థరాత్రి సహాయం – రాత్రి 3 గంటలకు కూడా సిద్ధం:

నగరాల్లో సాధారణంగా అర్ధరాత్రి సమయంలో వాహనాలు దొరకడం చాలా కష్టం. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను గుర్తించిన సదరు మహిళా ఆటో డ్రైవర్, రాత్రివేళల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని సమాచారం అందితే తక్షణమే తన ఆటోతో అక్కడికి చేరుకుంటారు. గర్భిణులు, ఆసుపత్రికి వెళ్లాల్సిన బాధితులు, ఒంటరి మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.

సేవే నా ధ్యేయం:

కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా, సమాజంలో మహిళలకు భద్రతా భావాన్ని కల్పించడం, కష్ట సమయంలో తోటివారికి సహాయం చేయడమే తన జీవిత లక్ష్యమని ఆమె చెప్పారు.. అర్ధరాత్రి 3 గంటల సమయంలో కూడా ఎవరైనా ఫోన్ చేసి సహాయం కోరితే ఏమాత్రం వెనుకాడకుండా బయలుదేరుతారు. చాలా సందర్భాల్లో డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పటికీ, అత్యవసర పరిస్థితిలో ఉన్నవారి నుంచి రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత సేవలు అందిస్తుంటారు.

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం:

ఈ మహిళా ఆటో డ్రైవర్ స్ఫూర్తిదాయక సేవలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేలాది మంది నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అత్యవసర సమయంలో దేవుడిలా వచ్చి సహాయం చేసే ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శం అని నెటిజన్లు కామెంట్లు పెద్ద సంఖ్యలో ప్రశంసల వర్షం కురిపించారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో స్వార్థం పెరుగుతున్న తరుణంలో, ఈ వడోదర మహిళా డ్రైవర్ చూపుతున్న సేవా నిరతి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us