AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ వాట్ ఏ ఐడియా.. ఇలా చేస్తే కొత్తిమీర ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది.

కూరేదైనా చివర్లో కాస్త కొత్తిమీర చల్లితే వచ్చే ఆ ఘుమఘుమలు, రుచే వేరు. అయితే మార్కెట్ నుంచి ఎంత పచ్చగా, తాజాగా తెచ్చినా.. ఫ్రిజ్‌లో పెట్టినా సరే రెండు మూడు రోజుల్లోనే నల్లబడి కుళ్లిపోవడం ప్రతి ఇంటా ఎదురయ్యే పెద్ద తలనొప్పి. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొత్తిమీరను వారం కాదు.. ఏకంగా నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.

వావ్ వాట్ ఏ ఐడియా.. ఇలా చేస్తే కొత్తిమీర ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది.
How To Keep Coriander Fresh For Weeks
Krishna S
|

Updated on: Aug 08, 2026 | 12:58 PM

Share

వంటల్లో చివర్లో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. అయితే మార్కెట్ నుంచి ఎంత తాజాగా తెచ్చినా.. రెండ్రోజులకే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం చాలామంది మహిళలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తిమీర పాడైపోతే మరీ బాధగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొత్తిమీరను వారాల తరబడి, దాదాపు నెల రోజుల వరకు కూడా అప్పుడే కోసినంత తాజాగా నిల్వ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పేపర్ టవల్ పద్ధతి

కొత్తిమీర త్వరగా పాడవ్వడానికి ప్రధాన కారణం అందులో ఉండే తడి. మార్కెట్ నుంచి తెచ్చిన కొత్తిమీరను ముందుగా కడిగి, నీళ్లన్నీ పూర్తిగా ఆరిపోయే వరకు ఆరబెట్టాలి. ఆ తర్వాత కుళ్ళిన లేదా పాడైన ఆకులను తీసేయాలి. ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని, అడుగున పేపర్ టవల్ లేదా టిష్యూ పేపర్ పరచాలి. దానిపై కొత్తిమీరను ఉంచి, పైన కూడా మరొక టిష్యూ పేపర్ మూసి బాక్స్ మూత పెట్టాలి. టిష్యూ పేపర్ కొత్తిమీరలోని అదనపు తేమను పీల్చుకుని ఆకులు పాడవకుండా చూస్తుంది.

నీళ్ల గ్లాస్ పద్ధతి

  • ఈ పద్ధతి కొత్తిమీరను చాలా రోజుల పాటు పచ్చగా ఉంచుతుంది.
  • కొత్తిమీర వేళ్లను కడగకుండా అలాగే ఉంచండి.
  • ఒక గాజు గ్లాసులో లేదా ప్లాస్టిక్ జార్‌లో కొద్దిగా నీళ్లు పోసి, కొత్తిమీర వేళ్లు మాత్రమే నీళ్లలో మునిగేలా ఉంచండి.
  • పైన ఒక ప్లాస్టిక్ కవర్‌ను కప్పి, ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
  • ప్రతి 2-3 రోజులకు ఒకసారి గ్లాసులోని నీటిని మారుస్తూ ఉంటే కొత్తిమీర చాలా వారాల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది.

కొత్తిమీర ఐస్ క్యూబ్స్

కొత్తిమీరను నెలల తరబడి నిల్వ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.

  • కొత్తిమీరను బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  • ఈ తరిగిన కొత్తిమీరను ఐస్ ట్రేలో నింపాలి.
  • పైన కొద్దిగా నీళ్లు లేదా వంట నూనె పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి.
  • కూరలు, పప్పు లేదా సాంబార్ చేసేటప్పుడు నేరుగా ఒక ఐస్ క్యూబ్ తీసి అందులో వేసేస్తే సరిపోతుంది. రుచి, సువాసన అస్సలు మారవు.

నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

తడి లేకుండా చూడండి: కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెట్టేముందు అందులో తడి లేకుండా పూర్తిగా ఆరిపోయేలా చూడటం అత్యంత ముఖ్యం.

చెడిపోయిన ఆకులను తీసేయండి: ఒక్క ఆకు కుళ్లినా, దానివల్ల మిగిలిన కట్ట అంతా పాడైపోతుంది. కాబట్టి దాచే ముందే పాడైన ఆకులను వేరు చేయాలి.

ప్లాస్టిక్ సంచుల్లో నేరుగా పెట్టొద్దు: మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్‌లో అలాగే ఉంచితే తేమ పెరిగిపోతుంది.

ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ వంటల్లో ఎప్పుడూ తాజా కొత్తిమీర సువాసన వెదజల్లుతూనే ఉంటుంది.

Follow Us
భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి అవమానించాడు..
భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి అవమానించాడు..
ఆలోచనలతో కంప్యూటర్‌లో టైప్ చేసే టెక్నాలజీ.. మస్క్ అద్భుతం!
ఆలోచనలతో కంప్యూటర్‌లో టైప్ చేసే టెక్నాలజీ.. మస్క్ అద్భుతం!
ఇక్కడి చీపురు దుమ్ముకూ భారీ డిమాండ్!
ఇక్కడి చీపురు దుమ్ముకూ భారీ డిమాండ్!
ఎముకల బలానికి, నీరసానికి ఒకే ఒక్క ఔషధం.. ఈ పాయసం
ఎముకల బలానికి, నీరసానికి ఒకే ఒక్క ఔషధం.. ఈ పాయసం
వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు.. ఇలా చేస్తే రెండు.. మూడుతో ఆపరు..
వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు.. ఇలా చేస్తే రెండు.. మూడుతో ఆపరు..
దీపారాధనకు ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఒక్కో నూనెకు..
దీపారాధనకు ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఒక్కో నూనెకు..
నోట్లో వేస్తే వెన్నలా జారిపోయే కొబ్బరి హల్వా.. 10 నిమిషాల్లో రెడీ
నోట్లో వేస్తే వెన్నలా జారిపోయే కొబ్బరి హల్వా.. 10 నిమిషాల్లో రెడీ
ఒంట్లో వేడిని తరిమికొట్టి.. బాడీని చల్లగా చేసే గారెలు.. పేదింటిలో
ఒంట్లో వేడిని తరిమికొట్టి.. బాడీని చల్లగా చేసే గారెలు.. పేదింటిలో
రోజూ 7 గంటల నిద్ర కూడా ఉండట్లేదా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!
రోజూ 7 గంటల నిద్ర కూడా ఉండట్లేదా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!
బ్లాక్ డ్రెస్‌లో లేడీ సూపర్‌స్టార్ రచ్చ.. 40 దాటినా తగ్గని క్రేజ్
బ్లాక్ డ్రెస్‌లో లేడీ సూపర్‌స్టార్ రచ్చ.. 40 దాటినా తగ్గని క్రేజ్