AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే గొర్రెలతో వెళ్లాడు.. రెండు రోజుల తర్వాత విగతజీవిగా.. మెదక్ జిల్లాలో విషాదం!

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గొర్రెలు మేపేందుకు వెళ్లిన బాబు అనే వ్యక్తి రెండు రోజుల పాటు అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు గ్రామ చెరువులో అతని మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయాన్నే గొర్రెలతో వెళ్లాడు.. రెండు రోజుల తర్వాత విగతజీవిగా.. మెదక్ జిల్లాలో విషాదం!
Man Found Dead In Pond
P Shivteja
| Edited By: |

Updated on: Nov 22, 2026 | 10:11 PM

Share

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం గొర్రెలను మేపడానికి వెళ్లిన ఓ వ్యక్తి, అదృశ్యమైన రెండు రోజుల తర్వాత గ్రామ చెరువులో విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టాల గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఎప్పటిలాగే ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో తన గొర్రెలను తోలుకుని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళాడు. అయితే, సాయంత్రం చీకటి పడినా బాబు ఇంటికి తిరిగి రాలేదు..

దీంతో ఆందోళన చెందిన భార్య మంజుల, ఇతర కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, పొలాలు, బంధువుల ఇళ్ల వద్ద తీవ్రంగా గాలించారు. అయినప్పటికీ అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు.

చెరువులో మృతదేహం లభ్యం

రెండు రోజుల పాటు ఆచూకీ లేకుండా పోయిన బాబు, గ్రామ చెరువులో శవమై తేలాడు. ఉదయాన్నే చెరువు వైపు వెళ్లిన గ్రామస్తులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భార్య మంజుల, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఈ ఘటనపై మృతుడి భార్య మంజుల కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త మృతిపై ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి..
అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి..
అరటికాయ వేపుడు ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడూ ఇదే చేసుకుంటారు
అరటికాయ వేపుడు ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడూ ఇదే చేసుకుంటారు
తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..
తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..
మీ ఇంటి కిచెన్ లో ఉండే ఈ ముక్కలను ముఖం మీద రుద్దితే మెరిసిపోతుంది
మీ ఇంటి కిచెన్ లో ఉండే ఈ ముక్కలను ముఖం మీద రుద్దితే మెరిసిపోతుంది
రష్మిక ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..'మైసా' విడుదల వాయిదా.. కారణమిదే
రష్మిక ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..'మైసా' విడుదల వాయిదా.. కారణమిదే
హైదరాబాద్‌లో హై అలర్ట్.. కాచిగూడకు ఉగ్రవాదుల బెదిరింపు
హైదరాబాద్‌లో హై అలర్ట్.. కాచిగూడకు ఉగ్రవాదుల బెదిరింపు
నోట్లో వేస్తే కరిగిపోయేలా.. సుతిమెత్తని రవ్వ లడ్డు పక్కా కొలతలతో
నోట్లో వేస్తే కరిగిపోయేలా.. సుతిమెత్తని రవ్వ లడ్డు పక్కా కొలతలతో
ఓల్డ్ బైక్స్‌కు మళ్లీ ఫుల్ క్రేజ్.. కొత్త బైక్‌లను మించిన డిమాండ్
ఓల్డ్ బైక్స్‌కు మళ్లీ ఫుల్ క్రేజ్.. కొత్త బైక్‌లను మించిన డిమాండ్