బాహుబలి, RRR రికార్డులను బ్రేక్ చేసేలా రాజమౌళి యాక్షన్ ప్లాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాహుబలి తరహాలోనే ఈ చిత్రంలో కొత్త భాష, లిపిని సృష్టిస్తున్నారు. టైమ్ ట్రావెల్ సీక్వెన్స్‌ల కోసం ఈ ప్రత్యేక భాషను ఉపయోగిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ సినిమా తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి సినిమాలో కిలికి భాషను సృష్టించి సంచలనం సృష్టించిన రాజమౌళి, ఇప్పుడు వారణాసి కోసం కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. ఈ మూవీలో వచ్చే టైమ్ ట్రావెల్ సీక్వెన్స్‌ల నేటివిటీ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త భాషను, లిపిని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం ఓ లింగ్విస్టిక్ ఎక్స్‌పర్ట్‌ను కూడా మేకర్స్ రంగంలోకి దించినట్లు సమాచారం. కిలికి భాష మాట్లాడటానికి మాత్రమే పరిమితం కాగా, ఈ కొత్త భాషకి స్ట్రక్చర్, రాసిన లిపి కూడా ఉండబోతోంది. ఈ లిపిలోని రహస్యాలను ఛేదిస్తూ మహేష్ బాబు సాగించే అడ్వెంచర్ సీన్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తాయని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

