AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: IMDBలో 9.5 రేటింగ్‌తో సంచలనం.. ఓటీటీలో సూపర్ హిట్ రొమాంటిక్ థ్రిల్లర్.. తప్పకుండా చూడాల్సిన మూవీ

ఇదొక తమిళ సినిమా. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. తమిళ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఐఎమ్ డీబీలో ఈ లవ్ థ్రిల్లర్ మూవీకి ఏకంగా 9.5 రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: IMDBలో 9.5 రేటింగ్‌తో సంచలనం.. ఓటీటీలో సూపర్ హిట్ రొమాంటిక్ థ్రిల్లర్.. తప్పకుండా చూడాల్సిన మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 16, 2026 | 7:35 AM

Share

కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ నటించిన ఒక సినిమా ఇటీవల తమిళనాట సంచలన విజయం సాధించింది. కన్నప్ప, బ్లాస్ట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. పేరుకు ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు చాలా ఉన్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ పర్ఫెక్ట్ సర్వైవల్ థ్రిల్లర్ తమిళ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఐఎమ్ డీబీలో ఈ లవ్ థ్రిల్లర్ మూవీకి ఏకంగా 9.5 రేటింగ్ దక్కడం విశేషం. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య (అశోక్ సెల్వన్), ఇయల్ (ప్రీతి ముఖుందన్) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఓ హిల్ స్టేషన్‌లో అందమైన ఇంటిని కొనుగోలు చేస్తాడు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ప్రాణాపాయ స్థితి నుంచి భార్యను కాపాడుకునేందుకు హీరో ఏం చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే

మొత్తానికి ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ కలగలిపిన ఒక పర్ఫెక్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ‘అన్బిల్ అవన్’. డెబ్యూ డైరెక్టర్ ఆర్. కార్తికేయన్ ఈ సినిమాను అద్బుతంగా తెరకెక్కించాడు. రేవతి, అబ్దుసమద్, కదిర్‌బాలు రాజనాయగం తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ కుమారన్ ఫిల్మ్స్, ఐంగరన్ ఇంటర్నేషనల్, హ్యాపీ హై పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. . ’96’ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత తన బీజీఎమ్ తో ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన అన్బిల్ అవన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (నవంబర్ 20) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు,క న్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ లో అన్బిల్ అవన్..

అన్బిల్ అవన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us