AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే దుల్కర్ సల్మాన్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది.. ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ సినిమా 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రుతిహాసన్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందుకే దుల్కర్ సల్మాన్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది.. 'ఆకాశంలో ఒక తార' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్
Allu Arjun Speech In Aakasamlo Oka Tara Pre-Release Event
Basha Shek
|

Updated on: Nov 15, 2026 | 9:00 PM

Share

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నారు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు మరో హిట్ కట్టేందుకు రెడీ అయ్యారీ హ్యాండ్సమ్ హీరో. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ సినిమా ఆకాశంలో ఒక తార. కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో శ్రుతి హాసన్ యాక్ట్ చేస్తోంది. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని సమర్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు, గ్లింప్స్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (నవంబర్ 16) హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఆకాశంలో ఒక తార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దుల్కర్, సాత్వికతో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..

‘దుల్కర్ సల్మాన్ కు తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తీశారు. ఆయన గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. మలయాళం  తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. దిగ్రేట్ మణిరత్నం లాంటి డైరెక్టర్లతో సినిమాలు తీశారు. ఇక తెలుగులో కూడా మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలు తీశారు. దుల్కర్ సినిమాల సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయన గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి. హీరోయిన్ సాత్విక వీరవల్లికి ఈ మూవీ గ్రాండ్ లాంఛ్ అవ్వాలి. అలాగే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేందుకు కృషి చేసిన వారందరికీ నా విషెస్.. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలి’ అని ఆకాంక్షించారు అల్లు అర్జున్.

ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us