Ashu Reddy: ఆ జబర్దస్త్ నటుడితో ప్రేమ వివాహం.. అసలు విషయం చెప్పేసిన బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి
బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి ఇటీవల ఓ పాడ్ కాస్ట్ కు హాజరైంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో ఓ జబర్దస్త్ స్టార్ తో తాను ప్రేమలో ఉందన్న రూమర్లపై కూడా క్లారిటీ ఇచ్చిందీ అందాల తార.

టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయ్యింది అషూరెడ్డి. ముఖ్యంగా ‘జూనియర్ సమంత’ అన్న ట్యాగ్ ఈ ముద్దుగుమ్మకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ఈ క్రేజ్ తోనే బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టింది. తన ట్యాలెంట్ చూపించింది. ఆపై బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొని మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది అషూ రెడ్డి. ఆ మధ్యన కొన్ని తెలుగు సినిమాల్లోనూ కనిపించింది అషూరెడ్డి. సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే అప్పుడప్పుడు వివాదాస్పద విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటుందీ అందాల తార. ఆ మధ్యన తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషూ రెడ్డి మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాడ్ కాస్ట్ కు హాజరైంది అషూరెడ్డి. ఈ సందర్భంగా తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఇదే క్రమంలో సుధీర్ తో తన అనుబంధం ఎలాంటిదో కూడా చెప్పుకొచ్చిందీ అందాల తార.
‘సుధీర్ గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఫ్యామిలీ స్టార్స్‌లో మా ఇద్దరిదీ ఇదే ఫస్ట్ షో. రెండేళ్ల నుంచి ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. ఆయన చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. బయట కానీ, స్టేజ్ మీద కానీ అమ్మాయిలకు సంబంధించి ఏదే ఒక కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడా సుధీర్ సీరియస్ అవ్వలేదు.. మనల్ని ఏమైనా అంటేనే తట్టుకోలేం. కానీ ఆయన సిల్లీగా తీసుకుని, అలాగే కౌంటర్ ఇచ్చి పనిని పని లాగే తీసుకుంటాడు. సుధీర్ గారు హార్డ్ వర్కర్.. పని అయిపోయిందా, ఇంటికి వెళ్లిపోయామా అన్నట్లుగానే ఉంటాడు’ అంటూ సుధీర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది అషూరెడ్డి. తద్వారా తమ ఇద్దరి గురించి వస్తోన్న పుకార్లను కొట్టి పారేసిందీ బిగ్ బాస్ బ్యూటీ
సుప్రిత పాడ్ కాస్ట్ లో అషూరెడ్డి..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




