AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megaverse Talk Show: మెగాస్టార్ చిరంజీవి టాక్ షో.. భార్యతో కలిసి సందడి చేయనున్న ఆ స్టార్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా త్వరలోనే ఓ టాక్ షో ప్రారంభం కానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ టాక్ షోకు మెగావర్స్ అనే పేరు కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

Megaverse Talk Show: మెగాస్టార్ చిరంజీవి టాక్ షో.. భార్యతో కలిసి సందడి చేయనున్న ఆ స్టార్ హీరో!
Megaverse Talk Show
Basha Shek
|

Updated on: Nov 17, 2026 | 6:54 PM

Share

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా ఒక సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమయ్యే ఈ మెగా షోకు మెగావర్స్ అనే పేరు కూడా ఖరారు చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి ప్రారంభం అనేది మాత్రం ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. అయితే మెగా వర్స్ ఫస్ట్ షోకు సంబంధించి పలు ఎపిసోడ్స్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు కన్నడ, మలయాళం, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఈ మెగా టాక్ షోలో సందడి చేయనున్నట్లు సమాచారం. ఫస్ట్ ఎపిసోడ్‌లో టాలీవుడ్‌ స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, లోకనాయకుడు కమల్ హాసన్ తదితర స్టార్స్ ఈ టాక్ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ జాబితాలోకి మరో స్టార్ కపుల్ చేరింది. వారే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య, ప్రముఖ నటి జ్యోతిక. మెగావర్స్ టాక్ షోకు సంబంధించి ప్రస్తుతం సూర్య, జ్యోతికలపై ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై షో నిర్వాహకుల నుంచి కానీ, సూర్య, జ్యోతిక నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమై మెగాస్టార్ చిరంజీవి, సూర్య, జ్యోతిక ఒకే వేదికపై కనిపిస్తే మాత్రం అభిమానులకు పండగే అని చెప్పవచ్చు

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూర్య-జ్యోతిక జంట ఒకటి. దక్షిణాదిలోనే కాదు ఇండియా వైడ్ గా ఈ దంపతులకు మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది. హీరో, హీరోయిన్లుగా ఇద్దరూ సినిమాల్లో స్టార్‌డమ్ సంపాదించుకున్న వీరు నిజ జీవితంలోనూ ఆదర్శ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సూర్య- జ్యోతిక చిరంజీవి మెగావర్స్ టాక్ షోకు వస్తే వారి సినీ ప్రయాణం, ప్రేమ, వివాహం, పిల్లలు కుటుంబ జీవితం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మెగా ఫ్యామిలీకి సూర్యకు మంచి అనుబంధం ఉంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలపై చర్చ జరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మెగా టాక్ షోలో సూర్య, జ్యోతిక పాల్గొన్నారని ఇన్‌సైడ్ టాక్. అయితే దీనిపై ఇంకా అఫీషియల్‌ ప్రకటనైతే రాలేదు. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us