క్యాన్సర్ అని తెలియగానే నాగేశ్వరరావు చేసిన పని అదేనట 

06-08-2026

Pic credit - Instagram

Phani Ch

తెలుగు సినీ నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారు కేవలం గొప్ప నటుడే కాదు, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి.

సినీ రంగంలో ఎంతటి అగ్ర నటుడిగా వెలుగొందినా, ఇంటికి వచ్చాక ఏఎన్ఆర్ గారు చాలా సాదాసీదా తండ్రిగా ఉండేవారట.

ఇకపోతే నాగేశ్వరరావు తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలలో క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నటించారు కానీ, నిజజీవితంలో కూడా ఆయన క్యాన్సర్ తోనే మరిణించారన్న విషయం తెలిసిందే.

 నాగేశ్వరరావు గారి  ఆరోగ్యం కుదుటన లేకపోవడంతో తనని కేర్ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్ కి సిటీ స్కాన్ కోసం తీసుకెళ్లారట.

అయితే అంబులెన్స్ వాళ్ళు తనని బసవతారకం హాస్పిటల్ తీసుకెళ్లమని చెప్పారు. వాళ్ళలా చెప్పడంతో నాన్న సరదాగా మాట్లాడుతూ నాకు క్యాన్సర్ ఉందని వీళ్ళు డిసైడ్ అయిపోయి అక్కడికి తీసుకెళ్లారని సరదాగా మాట్లాడారు.

అక్కడ పరీక్షలు చేయించడంతో నిజంగానే క్యాన్సర్ అని బయటపడిందట. . ఇక నాన్న ఎవరి రుణం ఉంచుకోరు అందుకే నాన్నను బాగా చూసుకున్న డాక్టర్లు, ఆ టీం అందరికీ  పిలిచి గిఫ్టులు ఇచ్చారని సుశీల తెలిపారు.

నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అని అక్టోబర్ లో తెలిస్తే నవంబర్లోనే నాన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని అందరికీ తెలిపి జనవరిలోనే చనిపోయారని నాగ సుశీల గుర్తు చేసుకున్నారు.