AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: వారణాసి కథ చెప్పిన జక్కన్న.. కారణం అదేనా..?

Varanasi: వారణాసి కథ చెప్పిన జక్కన్న.. కారణం అదేనా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 06, 2026 | 5:47 PM

Share

వెంకటేష్–కళ్యాణ్‌రామ్ చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే తన తదుపరి ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలిసారిగా యానిమేషన్ చిత్రంతో ప్రయోగం చేయాలని భావిస్తుండగా, ఆ తర్వాత బాలకృష్ణతో మరో సినిమా చేయనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ ప్లానింగ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

రెగ్యులర్ ఫార్మాట్స్‌లో సినిమాలు చేస్తే చూసే రోజులు పోయాయిప్పుడు.. ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అనే పెద్ద పదాలు వాడుతున్నపుడు తీసే స్టైల్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. వారణాసికి ఇదే చేస్తున్నారు దర్శక ధీరుడు. ఎంటైర్ సినిమాను ఐమాక్స్‌లో షూట్ చేసారు. దానికి కారణాలు కూడా చెప్పారాయన. మరి వారణాసి అప్‌డేట్ ఏంటి..? ఐమాక్స్ వర్షన్ ఎలా ఉండబోతుంది..? రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైంది.. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అవ్వగా, చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపారు జక్కన్న. ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. దీనికి ఓ బలమైన కారణం ఉంది. సినిమాలో చూపించే ప్రపంచం చాలా పెద్దదని.. అంటార్కిటికాలో ఉండే 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యపు భారీ సైన్యాలను స్క్రీన్‌పై చూపించాలన్నా, ఆ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అందించాలన్నా ఐమ్యాక్స్ స్క్రీన్ మాత్రమే కరెక్ట్ అని ఫిక్సయ్యాకే అందులోకి దిగారు జక్కన్న. కథపై కూడా క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇది వారణాసిలో మొదలై.. అక్కడి నుంచి మంచుతో నిండిన అంటార్కిటికా, ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి సాగుతుంది. అంతటితో ఆగకుండా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రోమ్ కాలానికి వెళ్లి, మళ్లీ చివరగా వారణాసికి చేరుకుంటుంది. ఈ లొకేషన్స్ వింటుంటేనే కథ స్పాన్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఆగస్ట్ 9న వారణాసి నుంచి మేజర్ అప్‌డేట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మహేష్ బాబు పుట్టిన రోజున కచ్చితంగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ చెప్తామంటున్నారు జక్కన్న. వారణాసికి మరో రికార్డ్ కూడా ఉంది. పూర్తిగా IMAX ఫార్మాట్‌లో షూట్ చేసిన తొలి నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్, ఒడిస్సీ కూడా ఐమాక్స్‌లో షూట్ చేసినవే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే

Health Benefits of Punarnava: ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే.. మోకాళ్ల నొప్పులు పరార్‌

ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి

Published on: Aug 06, 2026 05:44 PM
Follow Us