AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?

ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?

Phani CH
|

Updated on: Oct 30, 2026 | 5:46 PM

Share

అనిరుధ్‌ రవిచందర్‌, కావ్య మారన్‌ పెళ్లి, రిసెప్షన్‌ వార్తలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీరి రిసెప్షన్‌ ఆహ్వాన పత్రిక అంటూ ఓ ప్రత్యేక డిజైన్‌ కార్డు వీడియో వైరల్‌ అవుతోంది. క్లాసిక్‌ బరోక్‌ శైలిలో చేతితో రూపొందించిన ఈ కార్డు తయారీకి మూడున్నర నెలలు పట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో కార్డు ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఐపీఎల్ ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడనున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు.. ఎట్టకేలకు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. వీరిద్దరి గ్రాండ్‌ వెడ్డింగ్‌ గ్రీస్‌లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే వెడ్డింగ్‌ డేట్స్‌ విషయంలో ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. కానీ పెళ్లి కార్డు ఇదే నంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో పాటే ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌ కోసం కార్య – అనిరుధ్ చాలానే ఖర్చు పెట్టారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వచ్చేనెల 21 చెన్నైలో జరిగే రిస్పెషన్స్ కోసం కావ్య – అనిరుధ్ టీం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను సైతం తమ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిసెప్షన్‌ వేడుకకు సంబంధించిన కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ కార్డ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసెప్షన్‌ కార్డ్ కోసం ఏకంగా మూడున్నర నెలల పాటు కష్టపడ్డారని టాక్. ఈ కార్డ్‌ను ‘పింక్ విజిల్ మ్యాన్’ రంజని అయ్యంగార్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వాన పత్రికను క్లాసిక్ బరోక్ స్టైల్లో తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇన్విటేషన్ కార్డ్‌ను మొత్తం చేతితోనే రూపొందించారన చెబుతున్నారు. ఇలా చేసిన ఒక్కో కార్డు ధర దాదాపు రూ.15-20 వేల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కూడా సెలబ్రిటీలే కావడంతో తమ జీవితకాలం గుర్తుండిపోయే మధురమైన వేడుకను గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

నరకయాతన అంటే ఇదేనేమో.. త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు

కావ్య – అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒకే ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు ..

Sachin Tendulkar: 53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. నేటికీ.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం

ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..

Follow Us