AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కావ్య - అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒకే ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు ..

కావ్య – అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒకే ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు ..

Phani CH
|

Updated on: Oct 30, 2026 | 5:38 PM

Share

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ కో ఓనర్‌ కావ్య మారన్‌ పెళ్లిపై ఆసక్తికర వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నవంబర్‌ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనున్నట్లు సమాచారం. నవంబర్‌ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారని తెలుస్తోంది. రజనీకాంత్‌, ఏఆర్‌ రెహమాన్‌, అజిత్‌, శివకార్తికేయన్‌, అల్లు అర్జున్‌ వంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ బాక్స్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ కో ఓనర్‌ కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వచ్చేనెల 10, 11 తేదీల్లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రీస్ వేదికగా జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయిని సమాచారం. ఈ పెళ్లి వేడుకలో కేవలం ఇరు కుటుంబాలతో పాటు కావ్య- అనిరుధ్ ల అత్యంత దగ్గరి స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు. ఇక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్‌ 21న వెడ్డింగ్ రిసెస్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ లో జరిగే ఈ వేడుకకు ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తో సహా పలువురు ప్రముఖ సినీ, రాజకీయ నాయకుల హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ గ్రాండ్‌ రిసెప్షన్‌కు హాజరు కానున్నారని తెలుస్తోంది. అనిరుధ్ మామ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌, కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి, అజిత్ కుమార్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆహ్వానితులలో ఉన్నట్లు సమాచారం. కాగా టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ మాత్రమే ఈ అతిథుల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ల గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించి ఆహ్వానాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఇన్విటేషన్ బాక్స్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్‌ను అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఐవరీ రంగు బాక్స్‌పై లేత నీలి రంగు ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఇన్విటేషన్ బాక్స్ చాలా అద్బుతంగా ఉందంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా బాక్స్‌పై ఎంబాస్డ్‌ అక్షరాలు, వింటేజ్ లుక్స్ ఉన్న సీల్ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sachin Tendulkar: 53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. నేటికీ.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం

ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..

Follow Us